Cab driver strict rules: నన్ను భయ్యా అని పిలవొద్దు.. బెంగళూరు క్యాబ్ డ్రైవర్ స్ట్రిక్ట్ రూల్స్ ఏంటంటే..
ABN , Publish Date - Nov 24 , 2025 | 06:38 PM
బెంగళూరు వంటి సాఫ్ట్‌వేర్ సిటీలో క్యాబ్‌ల వాడకం చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ కఠినమైన నియమాల జాబితాను రూపొందించి దానిని సీటు వెనుక అతికించాడు. ఓ ప్రయాణికుడు దానిని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది ప్రస్తుతం వైరల్‌గా మారింది.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహా నగరాల్లో చాలా మంది ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాలన్నా క్యాబ్‌లను ఆశ్రయిస్తుంటారు. బెంగళూరు వంటి సాఫ్ట్‌వేర్ సిటీలో క్యాబ్‌ల వాడకం మరింత ఎక్కువ. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ కఠినమైన నియమాల జాబితాను రూపొందించి దానిని సీటు వెనుక అతికించాడు. ఓ ప్రయాణికుడు దానిని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది ప్రస్తుతం వైరల్‌గా మారింది (viral cab rules).
ఆ నోటీస్ బోర్డ్‌లో ఆరు రూల్స్ ఉన్నాయి. సూటిగా, స్పష్టంగా మరియు పదునుగా తన నియమాలను ఆ డ్రైవర్ ప్రయాణికులకు తెలిసేలా ఆ బోర్డ్ ఏర్పాటు చేశాడు. ఇంతకీ అందులో అతడు రాసిన రూల్స్ ఏంటంటే (cab driver strict rules viral)..
మీరు క్యాబ్ యజమాని కాదు.
డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తే యజమాని.
చక్కగా మాట్లాడండి, గౌరవం చూపించండి.
తలుపును నెమ్మదిగా మూయండి.
మీ ఆటిట్యూడ్‌ను మీ జేబులో ఉంచుకోండి.
నన్ను భయ్యా అని పిలవకండి.
నన్ను వేగంగా డ్రైవ్ చేయమని అడగకండి.

పై రూల్స్‌ను చదువుతుంటే ఆ క్యాబ్ డ్రైవర్ తన రోజువారీ జీవితంలో ఎంత చిరాకు, ఒత్తిడి, అవహేళనను ఎదుర్కొంటున్నాడో అర్థం చేసుకోవచ్చు (cab etiquette controversy). 'ఆ డ్రైవర్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ప్రతిరోజూ ప్రయాణీకులు దురుసుగా ప్రవర్తించడం, తొందరపడమని ఒత్తిడి చేయడం, వేగంగా డ్రైవ్ చేయమని డిమాండ్ చేయడంతో పాటు చాలా మంది అరుస్తూనే ఉంటారు' అని ఒకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఈ ఆంటీ తెలివికి సలాం కొట్టాల్సిందే.. వాషింగ్‌మెషిన్‌తో కోతులకు ఎలా చెక్ పెట్టిందో చూడండి..
ఐర్లాండ్ వాసులకు నిద్రలేకుండా చేసిన సింహం.. తీరా అసలు విషయం తెలిసి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..