Dipika Kakar: పాపం నటికి ఎంత కష్టం వచ్చింది.. కాలేయంలో టెన్నిస్ బాల్ సైజు ట్యూమర్
ABN , Publish Date - May 16 , 2025 | 11:32 AM
Actress Dipika Kakar: సీటీ స్కాన్‌లో దారుణమైన విషయం బయటపడింది. దీపిక కకర్ కాలేయంలో ట్యూమర్ ఉన్నట్లు తేలింది. అది కూడా టెన్నిస్ బాల్ సైజులో ఆ ట్యూమర్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆమె కుటుంబసభ్యులతో పాటు అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.

ప్రముఖ బాలీవుడ్ నటి దీపిక కకర్‌కు ఊహించని కష్టం వచ్చింది. ఆమె కాలేయంలో ట్యూమర్ బయటపడింది. ఆ ట్యూమర్ ఏకంగా టెన్నిస్ బాల్ సైజులో ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. కడుపు నొప్పి అని ఆస్పత్రికి వెళితే కాలేయంలో ట్యూమర్ ఉన్న సంగతి బయటపడింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం వెల్లడించాడు. తాజాగా చేసిన ఓ వ్లాగ్‌లో షోయబ్ మాట్లాడుతూ.. ‘ దీపిక ఆరోగ్యం సరిగా లేదు. ఆమె కడుపులో సమస్యగా ఉంది. నేను ఛండీఘర్‌లో ఉన్నపుడు దీపిక కడుపులో నొప్పి మొదలైంది. అసిడిటీ కారణంగా కడుపునొప్పి వస్తోందని అనుకున్నాము.
కడుపు నొప్పి ఎంతకీ తగ్గలేదు. అప్పుడు మా ఫ్యామిలీ డాక్టర్‌ను కలిసింది. ఆయన కొన్ని యాంటీ బయాటిక్స్ ఇచ్చాడు. బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పాడు. మే 5వ తేదీ వరకు ఆమె యాంటీ బయాటిక్స్ వాడుతూ ఉంది. నేను ఇంటికి తిరిగి వచ్చినపుడు కూడా తను బాగానే ఉంది. మా నాన్న పుట్టిన రోజు తర్వాత.. మళ్లీ దీపిక కడుపులో నొప్పి మొదలైంది. అప్పుడే ఆమె బ్లడ్ టెస్ట్ రిపోర్టులు వచ్చాయి. ఆమె శరీరంలో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు తేలింది. మళ్లీ మా డాక్టర్ దగ్గరకు వెళ్లాము. సీటీ స్కాన్ చేయించుకోమన్నాడు.
సీటీ స్కాన్‌లో దారుణమైన విషయం బయటపడింది. ఆమె కాలేయంలో ట్యూమర్ ఉన్నట్లు తేలింది. అది కూడా టెన్నిస్ బాల్ సైజులో ఆ ట్యూమర్ ఉన్నట్లు తేలింది. ఆ విషయం తెలిసి షాక్ అయ్యాము. అయితే, ఆ ట్యూమర్ స్టార్టింగ్ స్టేజిలో ఉన్నట్లు తేలింది. మరిన్ని రిపోర్టులు రావాల్సి ఉంది. ఆ రిపోర్టులను బట్టి చికిత్స తీసుకుంటాము’ అని అన్నారు. ఇక, దీపికను ఆస్పత్రిలో చేరాలని డాక్టర్లు సూచించారు. ఆమె ఆస్పత్రిలో చేరితే చికిత్స మొదలుపెట్టే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
Saudi Arabia: ఎడారి దేశంలో తెలుగు మహిళకు ఊహించని కష్టం
Viral Video: ఇలాంటి స్వాగతాన్ని మీరెప్పుడూ చూసుండరు..