Share News

Rapido Accident: ర్యాపిడో ఎక్కి భయపడ్డ యువతి.. కొద్దిసేపటి తర్వాత..

ABN , Publish Date - Jul 23 , 2025 | 05:49 PM

Rapido Accident: రాంగ్ సైడ్‌లో బైక్ నడుపుతూ ఓ చోట యాక్సిడెంట్ చేశాడు. ఎదురుగా వస్తున్న ఓ బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో ఇద్దరూ కిందపడిపోయారు. ర్యాపిడో బైక్ రైడర్‌కు గాయాలు కావటంతో పోలీసులు పట్టించుకోలేదు. ఫైన్, కేసులాంటివి లేకుండా అతడ్ని వదిలేశారు.

Rapido Accident: ర్యాపిడో ఎక్కి భయపడ్డ యువతి.. కొద్దిసేపటి తర్వాత..
Rapido Accident

ఈ మధ్య కాలంలో సిటీల్లో ర్యాపిడో బైక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సమయం వృధా అవుతుందనో.. బస్సుల్లో ఇరుక్కుని ప్రయాణించటం ఇష్టం లేకనో చాలా మంది రాపిడోను ఆశ్రయిస్తున్నారు. తాజాగా, ర్యాపిడో బైక్ ఎక్కిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. బైక్ రైడర్ కారణంగా ఆమె యాక్సిడెంట్‌కు గురైంది. ఈ సంఘటన ఢిల్లీలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత యువతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన వివరాల మేరకు..


ఢిల్లీకి చెందిన ప్రియాంక పని మీద బయటకు వెళ్లడానికి ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత బైక్ రైడర్ వచ్చాడు. అతడు హెల్మెట్ పెట్టుకోలేదు. హెల్మెట్ గురించి అతడ్ని అడగ్గా.. అవసరం లేదు అన్నాడు. ప్రియాంక భయపడుతూనే బైకుపై ఎక్కి కూర్చుంది. అతడు బైకును ముందుకు పోనిచ్చాడు. రైడర్ మీద నమ్మకం లేకపోవటం.. భయం కారణంగా ఆమె వీడియో తీయటం మొదలెట్టింది. కొద్దిసేపటి తర్వాత ఆమె భయపడిందే జరిగింది.


రాంగ్ సైడ్‌లో బైక్ నడుపుతూ ఓ చోట యాక్సిడెంట్ చేశాడు. ఎదురుగా వస్తున్న ఓ బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో ఇద్దరూ కిందపడిపోయారు. ర్యాపిడో బైక్ రైడర్‌కు గాయాలు కావటంతో పోలీసులు పట్టించుకోలేదు. ఫైన్, కేసులాంటివి లేకుండా అతడ్ని వదిలేశారు. ప్రియాంక అతడికి డబ్బులు ఇచ్చి మెట్రో స్టేషన్ వెళ్లిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ర్యాపిడో బైక్ రైడర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

అల్‌ఖైదా కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్రవాదుల అరెస్టు

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? ఈ హోమ్ డ్రింక్స్ మీ కోసమే.!

Updated Date - Jul 23 , 2025 | 06:03 PM