Crow Playing Football: పిల్లాడితో కలిసి ఫుట్ బాల్ ఆడిన కాకి..
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:51 PM
Crow Playing Football: ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ రొనాల్డో కాదు.. క్రౌనాల్డో’.. ‘ చాలా మంది ఫుట్‌బాల్ ప్లేయర్ల కంటే ఆ కాకి చాలా అద్భుతంగా ఆడుతోంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

పక్షి జాతిలో కాకులకు ప్రత్యేక స్థానం ఉంది. కాకులకు 7 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు ఉండే తెలివి తేటలు ఉంటాయి. ఇవి మనుషుల ముఖాల్ని గుర్తు పెట్టుకోగలవు. తమకు హాని కలిగించిన వ్యక్తుల ముఖాల్ని గుర్తు పెట్టుకుని మరీ పగ తీర్చుకోగలవు. ఈ విషయాలన్నీ సైంటిస్టుల పరిశోధనల్లో వెలుగులోకి వచ్చాయి. ఇంత తెలివైన కాకులు ఫుట్‌బాల్ ఆట ఆడటం అన్నది పెద్ద విషయమేమీ కాదు. తాజాగా, ఓ కాకి.. పిల్లాడితో కలిసి ఫుట్‌బాల్ ఆట ఆడింది. ఫుట్‌బాల్ అంటే నిజమైన ఫుట్‌బాల్ కాదు.
ఓ చిన్న మెత్తటి బాలుతో అది ఫుట్‌బాల్ ఆట ఆడింది. ఆ బాలును పిల్లాడు కాలుతో కాకి వైపు కొడుతూ ఉంటే.. ఆ కాకి తన ముక్కుతో బాలును బాలుడివైపు కొడుతూ ఉంది. ఇలా చాలా సార్లు బాలును బాలుడి వైపు ముక్కుతో కొట్టింది. ఇద్దరు మనుషులు కాళ్లతో ఫుట్‌బాల్ ఆడితే ఎలా ఉంటుందో .. అలా బాలుడు, కాకి కలిసి ఫుట్‌బాల్ ఆడారు. బాలుడు ఆ బాలును కాలితో తంతే.. కాకి తన ముక్కుతో తన్నింది. అంతే తేడా. ఈ సంఘటన మన ఇండియాలోని దక్షిణ గోవాలో చోటు చేసుకుంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ రొనాల్డో కాదు.. క్రౌనాల్డో’.. ‘ చాలా మంది ఫుట్‌బాల్ ప్లేయర్ల కంటే ఆ కాకి చాలా అద్భుతంగా ఆడుతోంది’..‘ నువ్వు సండే ఫ్రీగా ఉంటావా.. మాకు ఓ ఆటగాడి అవసరం ఉంది’..‘ కాకి ఫుట్‌బాల్ ఆడుతూ ఉంటే చాలా క్యూట్‌గా ఉంది’.. ‘ ఆ బ్రో.. గత జన్మలో ఫుట్‌బాల్ ప్లేయర్ అయి ఉంటాడు’ అంటూ ఫన్నీగా స్పందిస్తూ ఉన్నారు.
ఇవి కూడా చదవండి
పక్కా ప్లాన్ ప్రకారమే హత్యలు.. హసీనాపై అధికారిక అభియోగాలు
జుట్టు విపరీతంగా రాలిపోతోందని ఆందోళన పడకండి? ఈ చిట్కాతో కొన్ని రోజుల్లోనే సమస్య దూరం..!