Court Movie Fame Jabilli: దేవుడి మొక్కు.. రెండు వారాల్లోనే సినిమా ఛాన్స్
ABN , Publish Date - Apr 21 , 2025 | 09:25 PM
Court Movie Fame Jabilli: ఒక మంచి సినిమా రావాలని కోర్టు మూవీ ఫేమ్ జాబిల్లి.. అదే శ్రీదేవి వాడపల్లిలోని గుడిలో మొక్కుకుందట. ఏడు వారాలు మొక్కు ఉండగా.. రెండో వారంలోనే కోర్టు సినిమాలో అవకాశం వచ్చిందట. వాడపల్లి గుడికి అందరూ రావాలని కోరుకుంటోంది.

ప్రముఖ స్టార్ హీరో నాని ప్రొడ్యూసర్‌గా తెరకెక్కిన సినిమా ‘ కోర్టు’. రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత మార్చి నెలలో విడుదల అయింది. ప్రేక్షకులతో పాటు రివ్యూవర్ల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి గుర్తింపు వచ్చింది. జాబిల్లి క్యారెక్టర్‌లో నటించిన శ్రీదేవి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆమె జీవితం ఊహించని స్థాయిలో మారిపోయింది. సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇదంతా జరగడానికి దేవుడి మొక్కే కారణం అని శ్రీదేవి అంటోంది. వాడపల్లి గుడిలో మొక్కు కారణంగానే తనకు కోర్టు సినిమాలో అవకాశం వచ్చిందని చెప్పింది.
ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో శ్రీదేవి మాట్లాడుతూ.. ‘ నేను వాడపల్లిలో ఉన్నాను. నేను కోర్టు సినిమాలో జాబిల్లి క్యారెక్టర్ చేశాను. నేను ఏడువారాలు మొక్కుకున్నాను. ఒక మంచి సినిమా రావాలని ఇక్కడ ఏడు వారాలు చేశాము. రెండో వారంలోనే కోర్టు సినిమాలో అవకాశం వచ్చింది. సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఏడు వారాలు పూర్తయిన తర్వాత పూజ చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏం మొక్కినా.. నాకు చాలా మంచి జరిగింది. ఏదైతో అనుకున్నానో అది జరిగింది. కోర్టు సినిమాతో నాకు చాలా పేరు వచ్చింది. మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ’ అని అంది.
రీల్స్ టు రీల్
కోర్టు సినిమా ఫేమ్ జాబిల్లి సొంతూరు కాకినాడ. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ బాగా ఫేమస్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీదేవికి లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. శ్రీదేవి రీల్స్ చూసిన దర్శకుడు రామ్ జగదీశ్ .. సినిమా కోసం ఆమెను ఎంపిక చేశాడు. ఆడిషన్ చేసి జాబిల్లి పాత్ర కోసం సెలెక్ట్ చేశాడు. మొదటి సినిమాలోనే శ్రీదేవి తన సత్తా చాటింది. అందులో అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి సైతం శ్రీదేవిని ప్రత్యేకంగా పొగిడారు. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు రావటం పక్కా.
ఇవి కూడా చదవండి
Waqf Bill Supreme Court hearing: వక్ఫ్ బిల్లు చట్టభద్ధతపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
Inflation: సాధారణ ప్రజలకు గుడ్ న్యూస్.. 67 నెలల కనిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం