Relationship: వైవాహిక బంధంలో ఈ మార్పులు కనిపిస్తే విడాకుల వైపు అడుగులేస్తున్నట్టే
ABN , Publish Date - Mar 04 , 2025 | 10:01 PM
దంపతుల ప్రవర్తనలో కొన్ని మార్పులు కనిపిస్తే వారి మధ్య ఎడం పెరుగుతున్నట్టేనని సైకాలజిస్టులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

మారుతుండటంతో అనేక మంది విడాకుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఒకరికొకరం అన్నట్టు జీవించే యువ జంటలు కూడా అనేకం ఉన్నాయి. చుట్టూ ఇలాంటి పరిస్థితులను చూసినప్పుడు వైవాహిక జీవితం విజయవంతం చేసుకునేందుకు అసలు ఫార్ములా ఏదైనా ఉందా అనే సందేహం కలగకమానదు.
సంతోషంగా ఉన్న యువ జంటలు, ఒడిదుడుకులు తట్టుకోలే విడిపోయిన దంపతులను పరిశీలించాక సైకాలజిస్టులు కొన్ని వైవాహిక జీవితానికి సంబంధించి ముఖ్యమైన సూచనలు చేశారు. మనసులో ఉన్నది జీవిత భాగస్వామితో ఎలాంటి మొహమాటాలు లేకుండా పంచుకోవడమే దీర్ఘకాలిక బంధానికి అసలైన పునాది అని నిపుణులు చెబుతున్నారు (Relationships).
Psychological Games: పురుషులు మహిళలపై ప్రయోగించే మైండ్ గేమ్స్ ఇవే
పరస్పర గౌరవం, భావోద్వేగ పరమైన మద్దతు ఇవ్వడం, విభేదాలను నిర్మాణాత్మక ధోరణిలో పరిష్కరించుకోవడం వంటివి దంపతుల బంధం కలకాలం నిలిచుండేందుకు దోహద పడతాయి. సమస్య వచ్చినప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేయకుండా కలిసి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తే భార్యాభర్తల బంధం కలకాలం నిలిచుంటుంది.
అయితే, దంపతుల్లో కనిపించే కొన్ని మార్పులు వారి మధ్య దూరం పెరుగుతోందనేందుకు సంకేతం. విడాకుల వైపు అడుగులు వేస్తున్నారని అర్థం. ఇలాంటి జంటల ప్రవర్తలో కొన్ని సారూప్యతలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయిని నిపుణులు చెబుతున్నారు. మనసులో అవతలి వారిపై కోపం పంచుకోవడం, భావోద్వేగాలను పంచుకోకుండా దూరం పెట్టడం, అవతలి వారిని ప్రశంసించకపోవడం, వారి భావోద్వేగపరమైన మద్దతు ఇవ్వలేకపోవడం వంటివి ప్రధానంగా కనిపిస్తాయి.
Kitchen: వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఈ మార్పులు తప్పనిసరి!
నిత్యం అవతలి వారిని విమర్శించడం, వివాదాలు తలెత్తినప్పుడు రక్షణాత్మక ధోరణి ప్రదర్శించడం, చిరాకుపరాకులు ప్రదర్శించడం, మనసులోని విషయాలను అసలేం మాత్రం పంచుకోకుండా పరాయివారితో ఉన్నట్టు వ్యవహరిస్తుంటే ఆ జంట మధ్య బంధం బీటలు వారుతున్నట్టు భావించాలని సైకాలజిస్టులు చెబుతున్నారు.
అయితే, ఇలాంటి బంధాలను కూడా పునరుద్ధరించడం అంత కష్టమేమీ కాదనేది నిపుణులు చెప్పే మాట. జీవిగభాగస్వామి నిజాయితీగా మనసులో ఉన్నతి పంచుకుంటే అపార్థాలు, కోపాలు తొలగిపోయి చిటికెలో మానసికంగా దగ్గరవ్వొచ్చని భరోసా ఇస్తున్నారు.