Man Mums: కొత్త ట్రెండ్ .. అబ్బాయిలతో హగ్గుల కోసం ఎగబడుతున్న అమ్మాయిలు
ABN , Publish Date - Jun 08 , 2025 | 10:43 AM
Man Mums: చైనాలో ‘మ్యాన్ మమ్స్’ ట్రెండ్ బాగా పాపులర్ అయింది. మ్యాన్ మమ్స్ అని పిలువబడే అబ్బాయిల హగ్గుల కోసం అక్కడి అమ్మాయిలు ఎగబడుతున్నారు. 5 నిమిషాల హగ్గు కోసం ఏకంగా 50 యాన్లు చెల్లిస్తున్నారు.

కౌగిలింతను చాలా మంది ఓ బూతులాగా భావిస్తారు. కానీ, కౌగిలింతలో రొమాంటిక్ యాంగిల్ మాత్రమే కాకుండా.. ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంది. హగ్గుల వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మనం బాధలో ఉన్నపుడు ఇష్టమైన వారిని కౌగిలించు కోవటం వల్ల ఎంతో ఉపశమనం కలుగుతుంది. మనసులోని భారం తగ్గుతుంది. అందుకే చైనాలో ఓ కొత్త ట్రెండ్ తయారైంది. అమ్మాయిలు.. అబ్బాయిల హగ్గుల కోసం ఎగబడుతున్నారు. హగ్గుల కోసం డబ్బులు కూడా చెల్లిస్తున్నారు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. ప్రస్తుతం చైనాలో ‘మ్యాన్ మమ్స్’ ట్రెండ్ బాగా పాపులర్ అయింది. మ్యాన్ మమ్స్ అని పిలువబడే అబ్బాయిల హగ్గుల కోసం అక్కడి అమ్మాయిలు ఎగబడుతున్నారు. 5 నిమిషాల హగ్గు కోసం ఏకంగా 50 యాన్లు చెల్లిస్తున్నారు. 50 యాన్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో 600 రూపాయలు అవుతుంది. బాధల్లో ఉన్న అమ్మాయిలు ఎక్కువగా మ్యాన్ మమ్స్ ఓదార్పు కోరుకుంటున్నారు. 5 నిమిషాల కౌగిలింత ద్వారా ఎంతో ఉపసమనం కలుగుతోందని అంటున్నారు.
కొద్దిరోజుల క్రితం ఓ అమ్మాయి మ్యాన్ మమ్స్ హగ్గు గురించి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ‘నేను సెకండరీ స్కూల్లో ఉన్నపుడు ఓ సారి కౌగిలించుకున్నాను. చాలా బాగా అనిపించింది. అండర్ గ్రౌండ్ స్టేషన్లో ఓ ఐదు నిమిషాల పాటు మ్యాన్ మమ్స్ను కౌగిలించుకోవచ్చు’ అని పేర్కొంది. ఆమె పోస్టు బాగా వైరల్ అయింది. లక్షకుపైగా మంది కామెంట్లు చేశారు.
ఎవరీ మ్యాన్ మమ్స్
జిమ్ములకు వెళ్లి కండలు పెంచిన వారిని మ్యాన్ మమ్స్ అంటారు. ఇప్పుడు వీరే అమ్మాయిల పారిట వరంగా మారారు. డిప్రెషన్ లేదా ఇతర మానసిక సమస్యలతో బాధపడేవారు. వీరి ఆసరా తీసుకుంటున్నారు. 5 నిమిషాల పాటు వారిని కౌగిలించుకోవటం కోసం 600 రూపాయలు చెల్లిస్తున్నారు. అమ్మాయిలు చాట్ యాప్స్ ద్వారా మ్యాన్ మామ్స్ను బుక్ చేసుకుంటారు. మాల్స్, సబ్ వే స్టేషన్ల దగ్గర మీటింగ్ పాయింట్ ఉంటుంది. మ్యాన్ మమ్స్, అమ్మాయిలు అక్కడ కలుసుకుంటారు. ఐదు నిమిషాల కౌగిలింత తర్వాత అమ్మాయిలు డబ్బులు చెల్లిస్తారు. ఎవరి దారిన వారు వెళ్లిపోతారు.
ఇవి కూడా చదవండి
55 ఏళ్ల మహిళతో ఎఫైర్..60 ఏళ్ల ఆమె భర్తను..
ప్రభాస్ సినిమా కోసం నటుడి కష్టాలు