Share News

ఈ ఆలయంలో ప్రసాదంగా చైనీస్ న్యూడిల్స్.. కారణం ఏంటంటే..

ABN , Publish Date - Apr 11 , 2025 | 09:38 AM

Chinese Prasad Offering In Mandir: దాదాపు 80 ఏళ్లనుంచి ఆ గుడిలో చైనీస్ న్యూడిల్స్ ప్రసాదంగా పంచుతూ ఉన్నారు. ఆ గుడిలో అలా న్యూడిల్స్ పంచటం వెనుక ఓ బలమైన కారణం ఉంది. ఆ కారణం వల్లే ఇప్పటికీ కూడా భక్తులకు న్యూడిల్స్ ప్రసాదం అందుతోంది.

ఈ ఆలయంలో ప్రసాదంగా చైనీస్ న్యూడిల్స్.. కారణం ఏంటంటే..
Chinese Prasad Offering

సాధారణంగా ఏ గుడికైనా వెళితే ప్రసాదంగా ఏం పెడతారు?.. ఆ ప్రాంతానికి తగినట్లు భారతీయ వంటకాలను పంచుతారు. కానీ, ఈ గుడిలో మాత్రం ప్రసాదంగా చైనీస్ న్యూడిల్స్ పంచుతారు. అలాగని ఆ గుడి చైనాలోనో.. జపాన్‌లోనో లేదు. మన ఇండియాలోనే ఉంది. పశ్చిమ బెంగాల్‌, కోల్‌కతాలోని చైనా టౌన్ ( తాంగ్రా)లో ఓ కాళీమాత గుడి ఉంది. ఆ గుడిని నిర్మించిన నాటినుంచి ఇప్పటి వరకు అక్కడ నూడిల్స్‌ను భక్తులకు ప్రసాదంగా పంచుతున్నారు. ఆ గుడిలో ప్రసాదంగా నూడిల్స్ పంచడానికి ఓ బలమైన కారణం.. దాదాపు 80 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ కారణం వల్లే మొదటి నుంచి ఇప్పటి వరకు నూడిల్స్ ప్రసాదం పంపిణీ అవుతోంది.


ఇదీ చరిత్ర

ఈ కాళీ మందిరంలో చైనీస్ న్యూడిల్స్ పంచడానికి బలమైన కారణం ఉంది. సివిల్ వార్ సమయంలో పెద్ద సంఖ్యలో చైనీస్ ప్రజలు కోల్‌కతాకు వచ్చి స్థిరపడ్డారు. ఇండియాలో స్థిరపడ్డా కూడా వాళ్లు వారి సంప్రదాయాల్నే ఎక్కువగా పాటించేవారు. ఓ సారి ఓ చైనీస్ బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. డాక్టర్లు కూడా ఏమీ చేయలేమని చేతులు ఎత్తేశారు. అలాంటి టైంలో బాలుడి కుటుంబం కాళీమాత గుడికి వెళ్లింది. ఆ సమయంలో చెట్టు కింద ఉండే రెండు రాళ్లను కాళీమాతగా పూజించేవారు. ఆ బాలుడి కుటుంబం కాళీ మాతను ప్రార్థించింది. కొన్ని రోజుల తర్వాత అద్భుతం జరిగింది. బాలుడు ఆరోగ్యంగా తయారయ్యాడు. కాళీమాత కృప కారణంగానే తమ బిడ్డ బతికాడని అతడి కుటుంబం భావించింది.


ఇదే విషయాన్ని తోటి చైనీయులకు చెప్పింది. వారంతా ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలోనే చైనా కాళీమాత మందిరం నిర్మించారు. దాదాపు 80 ఏళ్ల క్రితం ఆ గుడిని కట్టారు. ఇక, అప్పటినుంచి భారతీయులతో పాటు చైనీయులు కూడా అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చే భక్తులకు చైనీస్ నూడిల్స్ ప్రసాదంగా పంచుతున్నారు. గుడిలో చైనీస్ న్యూడిల్స్ ప్రసాదంగా పంచడానికి ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు. ఆ గుడి నిర్మించింది చైనీయులు కాబట్టి వారి సంప్రదాయ వంటకమైన నూడిల్స్‌ను మొదటినుంచి పంచుతున్నారు. ఆ గుడి దాతలుగా ఇప్పటికీ చైనీస్ వాళ్లే ఉన్నారు. వారు తమను తాము చైనీస్ హిందువులం అని గర్వంగా చెప్పుకుంటారు.


ఇవి కూడా చదవండి

ఇది కదా టెక్నాలజీ అంటే.. 3Dతో 6 గంటల్లోనే రైల్వే స్టేషన్ కట్టేశారు..

Viral Video:గ్రద్ద ఎంత పని చేసింది.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ హాల్ టికెట్ ఎత్తుకెళ్లిపోయింది..

Updated Date - Apr 11 , 2025 | 09:38 AM