Share News

China: యూనివర్సిటీ డిగ్రీ ఉన్నా వీధిలో ఫుడ్ స్టాల్ పెట్టుకుని జీవనం.. ఎందుకని అడిగితే..

ABN , Publish Date - Apr 28 , 2025 | 07:32 AM

తాను చదువుకున్న యూనివర్సిటీ ముందే ఫుడ్ స్టాల్ పెట్టుకున్న ఓ యువకుడి ఉదంతం చైనాలో ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. అతడి తీరు చూసి జనాలు షాకైపోతున్నారు.

China: యూనివర్సిటీ డిగ్రీ ఉన్నా వీధిలో ఫుడ్ స్టాల్ పెట్టుకుని జీవనం.. ఎందుకని అడిగితే..
China Man starts Food Stall despite University Degree

ఇంటర్నెట్ డెస్క్: నేటి తరం యువత ట్రెండే వేరు. నచ్చిన పని ఎంత కష్టమైనా చేస్తారు... నచ్చని పని వైపు తలెత్తి కూడా చూడరు. ఈ ట్రెండ్‌కు అచ్చమైన ఉదాహరణగా నిలుస్తున్న ఓ చైనా యువకుడి ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. అతడి తీరు చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. స్కాలర్‌షిప్‌తో పీహెచ్‌డీ చేసే అవకాశం వచ్చినా కాదనుకుని వీధిలో ఫుడ్ స్టాల్ పెట్టుకున్న అతడి తీరు జనాల్ని ఆశ్చర్యపరుస్తోంది.

ఫే యూ (24) యువకుడిది పేద కుటుంబం. అయినా సహజ ప్రతిభతోనే అతడు చదువుల్లో రాణించాడు. చైనాలోని ప్రముఖ సిచువాన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తరువాత మరో ప్రముఖ చైనా యూనివర్సిటీలో పీజీ చేసే ఛాన్స్ కూడా వచ్చింది. కానీ ఫే మెంటార్ దుష్ప్రవర్తనతో అతడు డిప్రెషన్‌లో కూరుకుపోయాడు. అనారోగ్య సమస్యలు కూడా మొదలయ్యాయి. దీంతో, చదువు మధ్యలోనే మానేశాడు.


ఆ తరువాత అమెరికా యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రాజెక్టులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఓ ప్రముఖ యూనివర్సిటీ స్కాలర్‌షిప్‌తో సహా సీటు దక్కింది. కానీ అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు అతడి గమనాన్ని మరోవైపు మళ్లించాయి. యూనివర్సిటీ నిధులకు అమెరికా ప్రభుత్వం కోత పెట్టడంతో ఫే స్కాలర్‌షిప్ రద్దయిపోయింది.

ఫే మాత్రం నిరాశపడలేదు. వెనకడుగు వేయలేదు. ఉత్సాహంగా కార్యరంగంలోకి దిగాడు. తాను చదువుకున్న యూనివర్సిటీ ముందే ఓ ఫుడ్ స్టాల్ పెట్టుకున్నాడు. ప్రస్తుతం రోజుకు రూ.11 వేల వరకూ ఆదాయం పొందుతున్నాడు.


‘‘మంచి చదువు ఉండి కూడా ఇలా ఫుడ్ స్టాల్ పెట్టుకోవడం ఏంటని కొందరు నన్ను చూసి ఆశ్చర్యపోతుంటారు. మరికొందరు జాలి చూపిస్తుంటారు. తన డిగ్రీకి తగిన చదువు వెతుక్కోవచ్చు కదా అని సలహా ఇస్తుంటారు. కానీ ఇదేమీ సిగ్గు పడాల్సిన విషయం కాదు. ఇక ఫలితం కంటే ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడంపైనే దృష్టి పెట్టాలి. నేను చేస్తున్న పని చూసుకుని ఎప్పుడూ సిగ్గుపడలేదు. వాస్తవానికి నా గురించి తెలిసిన అనేక మంది నన్ను చూసేందుకు వస్తుంటారు. నా ఫుడ్ స్టాల్‌లో ఆహారం కూడా జనాలకు నచ్చుతోంది. అందుకే పదే పదే వస్తున్నారు’’ అని అతడు చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి:

సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలపై పాక్ ప్రజలు ఏమంటున్నారంటే..

మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..

అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు

Read Latest and Viral News

Updated Date - Apr 28 , 2025 | 07:34 AM