Share News

Check PF Balance Without UAN: పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలా.. యూఏఎన్ మర్చిపోయారా.. అయితే..

ABN , Publish Date - Feb 28 , 2025 | 09:55 AM

యూఏఎన్ నెంబర్ మర్చిపోయిన వారు కూడా సులభంగా తమ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు రెండు విధానాలు ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Check PF Balance Without UAN: పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలా.. యూఏఎన్ మర్చిపోయారా.. అయితే..

ఇంటర్నెట్ డెస్క్: జీవిత చరమాంకంలో ఆర్థిక భద్రత కోసం దేశంలోని అనేక మంది సంఘటిత రంగ ఉద్యోగులు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో మదుపు చేసుకుంటూ ఉంటారు. నెలనెలా క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఆర్థిక భద్రత దిశగా అడుగులు వేస్తుంటారు. ఇక ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ యూఏఎన్ నెంబర్ ఉంటుందన్న విషయం తెలిసిందే. పీఎఫ్ అకౌంట్లో అప్పటివరకూ జమైన మొత్తం ఎంతో తెలుసుకునేందుకు ఇది అత్యవసరం. కానీ కొన్ని సార్లు ఉద్యోగులు తమ యూఏఎన్ నెంబర్ మర్చిపోతుంటారు. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం (Check PF Balance Without UAN).

ఉద్యోగులకు ఎటువంటి సేవాలోపం లేకుండా ఉండేందుకు ఈపీఎఫ్ఓ అనేక చర్యలు చేపడుతోంది. ఈపీఎఫ్ ప్రయోజనాలు సులభంగా అందేందుకు సాంకేతికత సాయం కూడా తీసుకుంటోంది. ఇక యూఏఎన్ నెంబర్ మర్చిపోయినా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈపీఎఫ్ఓ పలు ప్రత్యామ్నాయాలు రెడీ చేసింది. యూఏఎన్ నెంబర్ మర్చిపోయినా వారు ఈ మార్గాల్లో సులభంగా తమ అకౌంట్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి వారికి మొత్తం మూడు మార్గాలు అందుబాటులో ఉన్నాయని ఈపీఎఫ్ఓ చెబుతోంది. అవేంటంటే..

Planetary Parade: నేటి సాయంత్రం అంతరిక్షంలో అద్భుతం.. ఒకే వరుసలో 7 గ్రహాలు


ఎస్‌ఎమ్ఎస్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు

  • ముందుగా లబ్ధిదారులు.. ఈపీఎఫ్ఓ వద్ద నమోదైన తమ మొబైల్ నెంబర్ నుంచి 7738299899కు ఎస్ఎమ్ఎస్ చేయాలి

  • EPFOHO UAN [తమ భాష కోడ్] పెట్టి మెసేజ్ పంపించాలి.

  • ఉదాహరణకు..ఇంగ్లిష్ భాషను ఎంచుకునేందుకు “EPFOHO UAN ENG” అని మెసేజ్ పంపించాలి.

  • ఆ తరువాత వచ్చే సూచనలను యథాతథంగా ఫాలో అయినే పీఎఫ్ బ్యాలెన్స్ తెలిసిపోతుంది

అయితే, యూఏఎన్ నెంబర్ యాక్టివ్‌గా ఉన్న వారు మాత్రమే ఈ సౌలభ్యాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. యూఏఎన్ బ్యాంకు అకౌంట్‌కు లింక్ కాకపోయినా ఆధార్ కార్డుకు అనుసంధానం కాకపోయినా ఈ విధానంలో బ్యాలెన్స్ తెలుసుకోవడం కుదరదు.

Teacher Rant on Bihar: బీహార్‌‌లో పోస్టింగ్.. కేంద్రీయ విద్యాలయ టీచర్‌ తిట్ల దండకం


మిస్డ్ కాల్ పద్ధతిలో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఇలా

  • ఈ విధానంలో 9966044425 నెంబర్‌కు రిజిస్టర్డ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వాలి

  • అనంతరం కాల్ ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అయిపోతుంది. ఆ తరువాత కొన్ని క్షణాలకు పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలతో కూడిన మెసేజ్ వస్తుంది.

  • ఈ ఎస్ఎమ్ఎస్ సేవలు ఉచితమే. ఎటువంటి రుసుము చెల్లించాల్సి ఉండదు.

యూఏఎన్ నెంబర్ తెలుసుకోవడం ఇలా

మీ వద్ద రిజస్టర్డ్ మొబైల్ నెంబర్ లేకున్నా యూఏఎన్ తెలుసుకోవచ్చు. అదెలా అంటే.. మీరు పనిచేస్తున్న సంస్థ ఇచ్చే శాలరీ స్లిప్‌లో యూఏఎన్ నెంబర్ ఉంటుంది. ఒకవేళ శాలరీ స్లిప్‌లో లేకపోతే మీరు పనిచేస్తున్న సంస్థ హెచ్‌‌ఆర్ విభాగాన్ని సంప్రదించిన ఈ సంఖ్యను తెలుసుకోవచ్చు

Read Latest and Viral News

Updated Date - Feb 28 , 2025 | 10:07 AM