Share News

Viral CCTV Video: కొన్ని సెకన్ల ముందే ప్రమాదాన్ని గ్రహించాయి.. ఠక్కున అక్కడినుంచి..

ABN , Publish Date - Jul 19 , 2025 | 06:46 AM

Viral CCTV Video: ఆమె అతి వేగంగా అక్కడినుంచి పక్కకు పరుగులు తీసింది. గోడకున్న టైల్స్ మొత్తం ఊడి సోఫా వరకు వచ్చిపడ్డాయి. ఆమె గనుక అక్కడే కూర్చుని ఉంటే కచ్చితంగా గాయపడేది. పిల్లుల కారణంగా తప్పించుకుంది.

Viral CCTV Video: కొన్ని సెకన్ల ముందే ప్రమాదాన్ని గ్రహించాయి.. ఠక్కున అక్కడినుంచి..
Viral CCTV Video

జంతువులు మనుషుల కంటే చాలా విషయాల్లో అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి. వాటి సెన్సింగ్, హియరింగ్ పవర్ చాలా గొప్పది. మన కంటికి కనిపించనివి వాటికి కనిపిస్తాయి.. మన చెవులకు వినిపించనివి వాటికి వినిపిస్తాయి. తాజాగా, పిల్లుల కారణంగా ఓ మహిళ పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఒకరకంగా చెప్పాలంటే చావునుంచి బయటపడింది. పిల్లుల వల్ల భారీ టైల్స్ మీద పడకుండా తప్పించుకోగలిగింది. ఈ సంఘటన చైనాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఓ మహిళ హాలులో టీవీ ముందున్న సోఫాలో కూర్చుని సెల్ ఫోన్ వాడుతూ ఉంది. రెండు పిల్లులు ఆమెకు కొద్ది దూరంలో ఉన్నాయి. ఓ పిల్లి టీవీ ముందు కూర్చుని అదే పనిగా గోడవైపు చూస్తూ ఉంది. మరో పిల్లి కూడా గోడవైపే చూస్తూ ఉంది. కొద్దిసేపటి తర్వాత రెండు పిల్లులు అలర్ట్ అయ్యాయి. ఏదో ప్రమాదం జరగబోతున్నట్లు అక్కడినుంచి పరుగులు తీశాయి. పిల్లులు అరుస్తూ పరుగులు తీయటంతో మహిళ ఫోన్‌లోంచి తలపైకెత్తింది. గోడవైపు చూసింది. గోడకు ఉన్న టైల్స్ ఒక్కసారిగా కూలిపోయాయి.


ఆమె అతి వేగంగా అక్కడినుంచి పక్కకు పరుగులు తీసింది. గోడకున్న టైల్స్ మొత్తం ఊడి సోఫా వరకు వచ్చిపడ్డాయి. ఆమె గనుక అక్కడే కూర్చుని ఉంటే కచ్చితంగా గాయపడేది. పిల్లుల కారణంగా తప్పించుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘మేడిన్ చైనా టైల్స్ అందుకే ఊడిపోయాయి’..‘పిల్లుల వినికిడి శక్తి చాలా బలమైనది. అవి టైల్స్ ఉడిపోతున్న శబ్ధాన్ని ఇట్టే గ్రహించాయి’ అని కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఆరోగ్యమే అందం..

ఉసిరికాయతో నోరూరేలా

Updated Date - Jul 19 , 2025 | 06:46 AM