Share News

Lottery: అదృష్టవంతుడంటే ఇతడే.. క్యాన్సర్ నుంచి కోలుకున్నాక రూ.15.6 కోట్ల లాటరీ

ABN , Publish Date - Jun 09 , 2025 | 05:32 PM

క్యాన్సర్ నుంచి కోలుకోవడమే కాకుండా ఏకంగా మూడు సార్లు కోట్లల్లో లాటరీ గెలిచారో కెనడా వృద్ధుడు. ఆయన ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.

Lottery: అదృష్టవంతుడంటే ఇతడే.. క్యాన్సర్ నుంచి కోలుకున్నాక రూ.15.6 కోట్ల లాటరీ
cancer survivor lottery win

ఇంటర్నెట్ డెస్క్: ఒక్కసారి లాటరీ దక్కితేనే జనాలు తెగ మురిసిపోతుంటారు. ఎంత సొమ్ము వచ్చిందన్న దానితో నిమిత్తం లేకుండా కనిపించినవారి కల్లా చెబుతుంటారు. మరి ఏకంగా మూడు సార్లు.. అదీ కోట్లల్లో డబ్బు గెలుచుకోవాలంటే కచ్చితంగా పెట్టిపుట్టాల్సిందే. కెనడాలోని ఓ వ్యక్తికి సరిగ్గా అలాంటి అదృష్టమే పట్టింది. ఏకంగా మూడు లాటరీల్లో కోట్లు గెలుచుకునేలా చేసింది. ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకున్నాక ఆయనకు ఈ లాటరీలు తగలడం కొసమెరుపు.

కెనడాకు చెందిన ఈ అదృష్టవంతుడి పేరు డేవిడ్ సెర్కిన్. ఆల్బర్టాలో ఉంటున్నారు. మే 3వ తేదీన ఆయన ఏకంగా 1 మిలియన్ డాలర్ల లాటరీ గెలుచుకున్నారు. గత ఏడాది కాలంలో ఆయనకు లాటరీ దక్కడం అది మూడోసారి. గతేడాది ఆగస్టు 20న సెర్కిన్ లాటో మ్యాక్స్ డ్రాలో ఏకంగా 5 లక్షల డాలర్లు గెలుచుకున్నారు. అదే ఏడాది నవంబర్ 16న లాటో 649 డ్రాలో మరో మిలియన్ గెలుచుకున్నారు. అయితే, ఇలా లాటరీలో కోట్లు గెలుచుకోవడం ఆయనకు కొత్తేమీ కాదు. పదేళ్ల క్రితం కూడా సెర్కిన్‌కు 2.5 లక్షల డాలర్ల లాటరీ దక్కింది. ఓమారు క్యాన్సర్‌ బారిన పడ్డ సెర్కిన్ ఆ తరువాత క్రమంగా కోలుకుని పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకున్నారు.


లాటరీ విషయం చెప్పగానే తన భార్య మళ్లీ లాటరీ గెలిచావా అంటూ ఆశ్చర్యపోయిందని సెర్కిన్ తెలిపారు. తాను దాదాపు రెండు దశాబ్దాలుగా లాటరీ టిక్కెట్లు కొంటున్నట్టు చెప్పారు. అయినా కానీ ఇన్ని బంపర్ లాటరీల్లో గెలవడమంటే తనకూ ఆశ్చర్యంగానే ఉందని చెప్పుకొచ్చారు. మరోసారి ఇలాంటి అదృష్టం దక్కుతుందని తాను అనుకోవట్లేదని కూడా పేర్కొన్నారు. అయితే, లాటరీ టిక్కెట్ల కొనుగోలును మాత్రం యథాతథంగా కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు. ‘లాటరీ టిక్కెట్ కొంటాం.. గెలిస్తే సరేసరి..లేదంటే మరో టిక్కెట్ కొంటాం’ అని ఆయన తన ఫిలాసఫీ గురించి వివరించారు.


ఇక సెర్కిన్ మిత్ర బృందం ఆశ్చర్యానికైతే అంతే లేకుండా పోయింది. ఇన్ని సార్లు లాటరీలో గెలవడం సాధ్యమేనా అంటూ వారు నోరెళ్లబెడుతున్నారు. ‘క్రితం సారి లాటరీ గెలిచినప్పుడు నా భార్యతో కలిసి హవాయ్‌కి టూర్‌పై వెళ్లా. ఈసారి న్యూఫౌండ్‌లాండ్‌కు వెళతా’ అని సెర్కిన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

ఆసుపత్రిలో ఉన్న ఉద్యోగిపై బాస్ శాడిజం.. చివరకు

ఐఐటీ జేఈఈ పరీక్ష.. చాట్ జీపీటీ ఎన్ని మార్కులు స్కోరు చేసిందో తెలిస్తే..

Read Latest and Viral News

Updated Date - Jun 09 , 2025 | 05:39 PM