Brave Cow Saves Calf: దూడను నోట కరుచుకున్న చిరుత.. ఆవును చూసి పరుగోపరుగు..
ABN , Publish Date - Aug 01 , 2025 | 03:40 PM
Brave Cow Saves Calf: దూడ ఒంటరిగా ఉంది. ఈ నేపథ్యంలోనే పక్కనే ఉన్న చెట్లలోంచి ఓ చిరుత పరుగున బయటకు వచ్చింది. వచ్చీరాగానే దూడను వెంబడించి పట్టుకుంది. దూడ చిరుత నుంచి తప్పించుకోవాలని చూసినా కుదరలేదు.

ఈ సృష్టిలో కల్మషం లేని ప్రేమ అంటూ ఉంటే అది కచ్చితంగా తల్లి ప్రేమే అని చెప్పాలి. బిడ్డ సుఖం కోసం తన సుఖాలను త్యాగం చేస్తుంది తల్లి. బిడ్డకు కష్టం వస్తే.. ఆఖరికి తన ప్రాణాలను కూడా లెక్క చేయదు. కేవలం మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ తల్లి ప్రేమ గొప్పగానే ఉంటుంది. తాజాగా, ఓ ఆవు తన బిడ్డను కాపాడుకోవడానికి చిరుత పులితో పోరాటానికి దిగింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆవును చూడగానే ఆ చిరుత పులి పారిపోయింది. ఈ సంఘటన రాజస్థాన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.
పాలిలోని బాలిలో కొన్ని రోజుల క్రితం ఓ ఆవు తన బిడ్డతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. ఆవు వేగంగా నడుస్తూ ముందుకు వెళుతుంటే.. దూడ మెల్లగా.. తల్లి వెనకాల అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తోంది. ఆవు చాలా దూరం ముందుకు వెళ్లిపోయింది. దూడ ఒంటరిగా ఉంది. ఈ నేపథ్యంలోనే పక్కనే ఉన్న చెట్లలోంచి ఓ చిరుత పరుగున బయటకు వచ్చింది. వచ్చీరాగానే దూడను వెంబడించి పట్టుకుంది. చిరుత నుంచి తప్పించుకోవాలని దూడ చూసినా కుదరలేదు. చిరుత దాని గొంతుపట్టుకుంది.
దూడ ప్రాణ భయంతో గట్టిగా అరవటం మెుదలుపెట్టింది. చిరుత అత్యంత వేగంగా దూడను చెట్లలోకి లాక్కెళ్లడానికి ప్రయత్నించసాగింది. దూడ అరుపులు దూరంగా ఉన్న తల్లికి వినిపించాయి. అంతే.. ఠక్కున వెనక్కు చూసింది. ఓ చిరుత బిడ్డను లాక్కెళుతుండటం చూసింది. వెంటనే దూడ వైపు పరుగులు తీసింది. దీంతో ఆ చిరుత భయపడిపోయింది. చెట్లలోకి పరుగులు పెట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు .. తల్లి ప్రేమంటే ఇది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సైబర్ ముఠా చేతుల్లో తెలుగు యువకులు.. డిప్యూటీ సీఎం పవన్‌కు విజ్ఞప్తి
వామ్మో.. నడి రోడ్డు మీద ఈ రోబో ఏం చేస్తోందో చూస్తే..