Nano banana AI tool: వామ్మో.. అచ్చం అలాగే.. ఫేక్ ఆధార్, పాన్ కార్డులను తయారు చేస్తున్న ఏఐ..
ABN , Publish Date - Nov 25 , 2025 | 05:45 PM
తాజాగా గూగుల్ 'నానో బనానా' అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్‌ను ఉపయోగించి బెంగళూరుకు చెందిన ఓ టెక్ నిపుణుడు అచ్చుగుద్దినట్టు, నిజమైన వాటిలాగే కనిపించే పాన్, ఆధార్ కార్డులను సృష్టించారు. వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వచ్చిన తర్వాత చాలా విషయాలు అయోమయంగా తయారయ్యాయి. సోషల్ మీడియా ఖాతాల్లో ప్రత్యక్షమవుతున్న వీడియోలు, ఫొటోలు అసలువో, నకిలీవో తెలుసుకోవడం మహా మహా టెక్ నిపుణులకే సాధ్యం కావడం లేదు. తాజాగా గూగుల్ 'నానో బనానా' ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్‌ను ఉపయోగించి బెంగళూరుకు చెందిన ఓ టెక్ నిపుణుడు అచ్చుగుద్దినట్టు, నిజమైన వాటిలాగే కనిపించే పాన్, ఆధార్ కార్డులను సృష్టించారు (AI misuse).
ఏఐ రూపొందించిన ఆ నకిలీ ఆధార్, పాన్ కార్డులను ఆయన ఎక్స్‌లో షేర్ చేశారు. నకిలీ గుర్తింపు కార్డులను తయారు చేయడం ఎంత సులభమో చూపించడానికి ఆయన ఈ కార్డుల ఫొటోలను షేర్ చేశారు. 'నానో బనానా చాలా బాగుంది. ఇప్పుడు అదే సమస్య అవుతోంది. ఇది అత్యంత కచ్చితత్వంతో నకిలీ గుర్తింపు కార్డులను సృష్టించగలదు. గుర్తింపు కార్డులను చెక్ చేసే చాలా వ్యవస్థలు ఇవి నకిలీవని గుర్తించడంలో కచ్చితంగా విఫలమవుతాయి. ఊహాజనిత వ్యక్తి పాన్, ఆధార్ కార్డులను షేర్ చేస్తున్నాను' అని హర్వీన్ సింగ్ చద్దా అనే టెకీ ట్వీట్ చేశారు (fake Aadhaar and PAN with AI).
ఆయన షేర్ చేసిన రెండు ఫొటోలు నిజమైనవి కావు (identity fraud AI). అయితే వాటిని చూస్తే సాధారణంగా ఎవరైనా నిజమైనవే అనుకుంటారు. చాలా లోతుగా పరిశీలిస్తేనే అవి నకిలీవని అర్థమవుతుంది. ఈ టెక్నాలజీ గురించి సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. నానా బనానా వల్ల భద్రతాపరమైన ముప్పు ఉంటుందని కొందరు ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
స్విగ్గీ, జొమాటో ఈమె ముందు బలాదూర్.. ఈ అమ్మ ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా..
పెట్రోల్ బంక్‌లో సున్నా మాత్రమే చూస్తున్నారా.. అయితే ఈ మోసం గురించి తెలుసుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..