Auto Driver: ఎంత శ్రీలీల ఫ్యాన్ అయితే.. డ్రైవింగ్ చేస్తూ ఏంటా పని..
ABN , Publish Date - Jul 19 , 2025 | 10:01 AM
Auto Driver: కస్టమర్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు ఆటో డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వాళ్లను ఊరికే వదిలిపెట్టకూడదని, ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఎంతలా అంటే.. జనాలు బానిస అయ్యేంతలా.. కొన్ని గంటల పాటు సోషల్ మీడియా వాడకపోతే చచ్చిపోతామేమో అన్నట్లుగా కొందరి ప్రవర్తన ఉంటోంది. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే.. కొంతమంది వాహనాలు నడుపుతూ కూడా సోషల్ మీడియా వాడుతున్నారు. కొన్ని రోజుల క్రితం నేను ఎక్కిన ఆటో డ్రైవర్.. డ్రైవింగ్ చేస్తూ యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ ఉన్నాడు. అచ్చం నాలాంటి అనుభవమే ఓ ఊబర్ కస్టమర్‌కు ఎదురైంది. అతడు ఎక్కిన ఆటో డ్రైవర్ శ్రీలీల అకౌంట్లోని పోస్టులు చూడ్డానికి నడిరోడ్డులో ఆటో ఆపేశాడట.
తన రెడ్డిట్ ఖాతాలో ఆ కస్టమర్ ఓ పోస్టు పెట్టాడు. ఆ పోస్టులో .. ‘నేను ఓ వ్యక్తిని కలవడానికి ఆఫీసుకు బయలుదేరా. నాకు 20 నిమిషాలు మాత్రమే టైం ఉంది. ఆటో బుక్ చేసుకున్నాను. నేనుండే ప్రదేశంనుంచి ఆఫీసుకు ఆటోలో పది నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. 20 నిమిషాలు ఉంది కదా అనుకున్నాను. నేను ఆటో ఎక్కగానే డ్రైవర్ మ్యాప్ ఓపెన్ చేసి చూశాడు. దాన్ని క్లోజ్ చేసి ఆటో నడపటం మొదలెట్టాడు. డ్రైవర్‌కు రూటు తెలుసేమో అనుకున్నాను. అతడు వెంటనే ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేశాడు.
ఆటో నడుపుతూ ఇన్‌స్టాగ్రామ్ చూస్తూ ఉన్నాడు. ఇంతలో శ్రీలీల పెట్టిన పోస్టు కనిపించింది. దాన్ని చూడగానే డ్రైవర్ ఆటో ఆపేశాడు. ఆమె అకౌంట్ ఓపెన్ చేసి పోస్టులు చూస్తూ ఉన్నాడు. నాకు విపరీతమైన కోపం వచ్చింది. కానీ, ఏమీ చేయలేని పరిస్థితి. చూస్తుండగానే సమయం మొత్తం గడిచిపోయింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. సదరు కస్టమర్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు ఆటో డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
తీవ్ర విషాదం.. చీర కొంగు ప్రాణం తీసింది..
కంటెంట్ క్రియేటర్లకు ప్రభుత్వం బంపర్ ఆఫర్.. రీల్ చేయండి డబ్బు గెలవండి