Share News

Shri Yantra: శ్రీ యంత్రం ఇంట్లో పెట్టుకున్నారంటే...

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:19 PM

వాస్తు శాస్త్రం ప్రకారం పేదరికం, దురదృష్టాన్ని దూరం చేసుకోవడానికి కొన్ని యంత్రాలు, వస్తువులు చాలా బాగా సహాయపడతాయి. వీటి ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పెంచి, దురదృష్టాన్ని నివారించుకోవచ్చు. ధనాన్ని ఆకర్షించవచ్చు. ఇప్పుడు శ్రీ యంత్రం గురించి తెలుసుకుందాం..

Shri Yantra: శ్రీ యంత్రం ఇంట్లో పెట్టుకున్నారంటే...
Shri Yantra Vastu benefits

Shri Yantra: వాస్తు శాస్త్రం (Vastu Shastram) ప్రకారం ఇంట్లో శక్తి ప్రవాహాన్ని సానుకూలంగా మార్చేందుకు వాస్తు యంత్రాలు ఉపయోగపడతాయి. ఇవి ఇంట్లోని సమస్యలు, అశుభాలను తొలగించి సానుకూల వాతావరణాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఆయా యంత్రాలు ఇంట్లో శాంతి, ఐశ్వర్యం, శుభ ఫలితాలను ఇస్తాయి. వాటిని ఇంట్లో పెట్టుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే పూజలు, ప్రత్యేక సందర్భాల్లో ఎప్పటికప్పుడు వాటిని పూజించడంతో అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. ఇంట్లో అశుభాలు తొలగిపోయి.. ఐశ్వర్యం, సుఖశాంతులు సిద్ధించాలంటే ఇంట్లో గానీ, కార్యాలయంలో గానీ శ్రీ యంత్రం ఏర్పాటు చేసి పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Also Read..: రెండవ రోజు కొనసాగుతున్న AI వర్క్‌షాప్..


శ్రీ యంత్రం ప్రత్యేకత..

ఇంటిని నిర్మించిన దర్వాత వాస్తు దోషాలు ఉంటే ఆ ఇంట్లో నివసించే వారికి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతాయి. అటువంటి సందర్భాల్లో ఇంటి నిర్మాణాన్ని తిరిగి చేపట్టలేం కనుక సమస్యలను తొలగించుకనేందుకు కొన్ని సాధారణ నియమాలు ఉన్నాయి. ఇంట్లో నిర్దిష్ట వాస్తు యంత్రాన్ని అమర్చడం ద్వారా ఈ సమస్యలను సరిదిద్దవచ్చు. ఇది ఇంట్లో శక్తి ప్రవాహాన్ని మెరుగుపరిచి సుఖ శాంతులను పెంచుతుంది. సానుకూలతను ఆకర్షించి, అడ్డంకులను తొలగిస్తుంది. శ్రీ యంత్రం అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన యంత్రం. ఇది లక్ష్మీదేవి విశ్వరూపానికి ప్రతీకగా చెబుతారు. లక్ష్మీ సంపద, శ్రేయస్సులకు దేవత. ఈ యంత్రానకి అద్భుత శక్తులు ఉన్నాయని, శీఘ్ర ఫలితాలను ఇవ్వగల సామర్థ్యం ఉందని నమ్ముతారు. హిందూ విశ్వాసాల ప్రకారం శ్రీ యంత్రం కలియుగంలో కామధేనువు వంటిది. ఇంట్లో లేదా కార్యాలయంలో ఈ యంత్రాన్ని పెట్టి పూజించడం వల్ల లక్ష్మీ దేవి ప్రసన్నం అవుతుంది.


శ్రీ యంత్రాన్ని ఇంట్లో ఎక్కడ పెట్టాలి..

శ్రీ యంత్రాన్ని ఇంట్లో, ఆఫీసులోని పూజ గదిలో లేదా ఈశాన్య మూల ఉంచాలి. ఇది లోపలికి సానుకూల శక్తులను ఆకర్షించి శ్రేయస్సు, సుఖ శాంతులను కలిగిస్తుంది. ఈ యంత్రాన్ని ప్రతిష్టించే ముందు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పంచామృతం లేదా గంగాజలంలో యంత్రాన్ని కడిగి శుభ్రం చేయాలి. తర్వాత ఈశాన్య మూలలో ఎర్రటి వస్త్రాన్ని పరిచి శ్రీ యంత్రాన్ని అందులో అమ్చాలి. తరువాత దీపం వెలిగించి యంత్రానికి పూజ చేయాలి. ఇలా పండుగలు ప్రత్యేక సమయాల్లో ఇంటిని, కార్యాలయాన్ని శుద్ధి చేసినప్పుడల్లా యంత్రాన్ని కూడా శుద్ధి చేసి తిరిగి ప్రతిష్టించి పూజలు చేయడం ద్వారా మేలు జరుగుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్రం కీలక చర్యలు.. సీమా హైదర్ పరిస్థితేంటి..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి విజయం

అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొంటారంటే..

For More AP News and Telugu News

Updated Date - Apr 25 , 2025 | 12:20 PM