Heart Melting Viral Video: క్యూట్ వీడియో.. ఏనుగు పిల్ల చేసిన పనికి అందరూ నవ్వేశారు..
ABN , Publish Date - Jul 28 , 2025 | 08:31 PM
Heart Melting Viral Video: 14 సెకన్ల ఆ పిల్ల ఏనుగు వీడియో మనసుకు హత్తుకునేలా ఉంది. వైరల్‌గా మారిన ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ పిల్ల ఏనుగు తనను తాను ఓ చిన్న పిల్లలాగా అనుకుంటోంది. ఎంత అల్లరి చేస్తోంది’.. ‘ బుజ్జి ఏనుగు భలే క్యూట్‌గా ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత మనసుకు హత్తుకునే ఎన్నో వీడియోలు చూసే అవకాశం దొరుకుతోంది. చిన్న పిల్లలు, జంతువుల అల్లరికి సంబంధించిన వీడియోలు చూస్తే టైమ్ ఇట్టే గడిచిపోతుంది. తాజాగా, ఓ పిల్ల ఏనుగు చేసిన పని నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ భార్యాభర్తల జంట మైదానంలో కూర్చుని ఉంది. వారి వెనకాలికి ఓ పిల్ల ఏనుగు వచ్చింది. వచ్చీ రాగానే భర్త వీపు పైకి ఎక్కింది.
అటు, ఇటు కదులుతూ తెగ అల్లరి చేసింది. ఆ పిల్ల ఏనుగు చేసిన పనికి పక్కనే ఉన్న భార్య పగలబడి నవ్వసాగింది. పక్కనే ఉన్న వారి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ వ్యక్తికి పిల్ల ఏనుగు బరువు మోయటం కొంచెం ఇబ్బందిగా అనిపించినా.. నవ్వుతూనే ఆ భారాన్ని మోసాడు. 14 సెకన్ల ఆ వీడియో మనసుకు హత్తుకునేలా ఉంది. వైరల్‌గా మారిన ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ పిల్ల ఏనుగు తనను తాను ఓ చిన్న పిల్లలాగా అనుకుంటోంది. ఎంత అల్లరి చేస్తోంది’.. ‘ బుజ్జి ఏనుగు భలే క్యూట్‌గా ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా, పిల్ల ఏనుగులు పుట్టిన కొన్ని గంటల్లోనే నిలబడటం, కొన్ని రోజుల్లోనే నడవటం నేర్చుకుంటాయి. అవి తమ తల్లిదండ్రుల నుంచి పెద్దల నుంచి ప్రతీ రోజూ నేర్చుకుంటూ ఉంటాయి. ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటాయి. అలాగని నేర్చుకోవాల్సిన విషయాలను ఆశ్రద్ధ చేయవు. ఓ వైపు సామాజిక బంధాలను పెంచుకుంటూనే.. మరో వైపు అల్లరి ఆటలు ఆడుతూ ఉంటాయి. ఒక్కచోట నిలకడగా ఉండకుండా అటు, ఇటు తిరుగుతూనే ఉంటాయి.
ఇవి కూడా చదవండి
ఓటర్ కార్డు కోసం అప్లై చేసుకున్న డాగ్ బాబు.. తర్వాత ఏం జరిగిందంటే..
70 ఏళ్ల బామ్మ సాహసం.. పామును మెడకు చుట్టుకుని..