Mysore Pak: భారత్, పాకిస్తాన్ యుద్ధం.. మైసూర్ పాక్‌లో పాక్ ఉందని..
ABN , Publish Date - May 23 , 2025 | 03:05 PM
Mysore Pak: రాజస్థాన్, జైపూర్‌లో త్యోహార్ స్వీట్స్ అనే స్వీట్ షాపు ఉంది. భారత్ పాక్ గొడవల నేపథ్యంలో ఈ స్వీట్ షాపు యజమానులు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మైసూర్ పాక్‌లో పాక్ అని ఉండటం వారికి నచ్చలేదు.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆపరేషన్ సిందూర్ కారణంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. అయినా కూడా తాము పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు ప్రవర్తిస్తోంది. ఇక, భారత పౌరులు కూడా పాక్ పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఎంతలా అంటే.. మైసూర్ పాక్‌లో పాక్ ఉందని.. మైసూర్ పాక్ పేరే మార్చేంతలా. అవును.. ఇది నిజమే. జైపూర్‌కు చెందిన ఓ స్వీట్ షాప్ ఈ వింత పనికి తెర తీసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్, జైపూర్‌లో త్యోహార్ స్వీట్స్ అనే స్వీట్ షాపు ఉంది. భారత్, పాక్ గొడవల నేపథ్యంలో ఈ స్వీట్ షాపు యజమానులు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మైసూర్ పాక్‌లో పాక్ అని ఉండటం వారికి నచ్చలేదు. మైసూర్ పాక్ నుంచి పాక్‌ను తీసేసి వేరే పేరు పెట్టారు. మైసూర్ పాక్‌కు మైసూర్ శ్రీ అని నామకరణం చేశారు. అయితే, కేవలం మైసూర్ పాక్ పేరు మాత్రమే కాదు..
మోతీ పాక్, ఆమ్ పాక్, గాండ్ పాక్‌ల పేర్లు కూడా మార్చారు. వాటికి మోతీ శ్రీ, ఆమ్ శ్రీ, గాండ్ శ్రీగ పేర్లు పెట్టారు. అంతేకాదు.. షాపులోనే ఫేమస్ ఐటమ్స్ అయిన స్వర్ణ్ భస్మ్ పాక్, చందీ భస్మ్ పాక్ పేర్లను కూడా మార్చారు. వీటన్నిటి పేర్ల చివర పాక్ ఉందన్న కారణంతో షాపు యజమానులు ఈ పని చేశారు. దేశం మీద ఉన్న భక్తితో వాటి పేర్లు మార్చామని తెలిపారు.
పాకిస్తాన్‌కు పాక్‌కు సంబంధం ఉందా?
ఆ స్వీట్ల పేర్ల చివరన ఉన్న పాక్‌కు పాకిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదు. సంస్కృతంలో పాకం అంటే వంట. కన్నడలో చెక్కర పాకాన్ని పాక్ అంటారు. మైసూర్ పాక్‌ను మొదటగా తయారు చేసింది మైసూర్ నగరంలో కాబట్టి దీనికి మైసూర్ పాక్ అని పేరు వచ్చింది. ఇదంతా ప్రాంతీయ భాషలకు సంబంధించింది. మైసూర్ పాక్‌లోని పాక్‌కు.. పాకిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదు.
ఇవి కూడా చదవండి
Jugaad Viral Video: తెలివంటే ఈమెదే.. వాటర్ బాటిల్‌ను వంద క్యాండిల్ బల్బుగా మార్చిందిగా..
Congress: కేటీఆర్ ఆరోపణలపై స్పందించిన కాంగ్రెస్