Ambanis Favourite Dish: రూ.250ల ఈ ఫుడ్ అంటే అంబానీ ఫ్యామిలీకి చాలా ఇష్టం..
ABN , Publish Date - Jul 23 , 2025 | 06:58 PM
Ambanis Favourite Dish: అనంత్ పెళ్లికి ప్రస్తుతం హోటల్ యజమాని శాంతేరీ నాయక్ వెళ్లారు. పెళ్లిలో ఆమెకు ఎంతో మర్యాద దక్కింది. పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఆమె కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: అంబానీ ఫ్యామిలీ ఆస్తి విలువ రూ.లక్షల కోట్లపైనే ఉంటుంది. అంత రిచ్ ఫ్యామిలీ చిటికేస్తే చాలు కోరుకున్నవన్నీ కంటి ముందుకు వచ్చి వాలుతాయి. ఇక, ఫుడ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. కోట్లు విలువ చేసే ఫుడ్ అయినా ఆర్డర్ చేసుకుని తినగలరు. అలాంటి అంబానీ ఫ్యామిలీకి రూ.250ల ఓ ఫుడ్ ఐటమ్ అంటే పిచ్చి. దాన్ని తరచుగా తెప్పించుకుని మరీ తింటుంటారు. ఆ ఫుడ్ ఐటమ్ ఏంటని తలలు బాదుకోకండి. అంబానీ ఫ్యామిలీ మెచ్చిన ఆ ఫుడ్ ఐటమ్ ఇంకేదో కాదు.. మైసూర్ మసాలా దోసె.
అంబానీ ఫ్యామిలీ మైసూర్ మసాలా దోసె తినటం వెనుక చాలా ఏళ్ల చరిత్ర.. ఎమోషన్ ఉంది. ముంబై మాతుంగా ఈస్ట్‌లో కేఫ్ మైసూర్ హోటల్ ఉంది. దాన్ని రమా నాయక్ 1936లో మొదలెట్టారు. ధీరూభాయ్ అంబానీ బతికున్న సమయంలో తరచుగా కేఫ్‌కు వెళ్లే వారు. మసాలా దోసె తిని, ఫిల్టర్ కాఫీ తాగే వారు. తండ్రి బాటలోనే ముఖేష్ అంబానీ ఆదివారాలు కేఫ్‌కు వెళ్లి మసాలా దోసె విత్ కొబ్బరి చట్నీ తినేవారు. ముఖేష్ బాటలోనే అనంత్, అనంత్ భార్య రాధిక మర్చంట్ కూడా అక్కడ దోసెలు తింటూ ఉన్నారు.
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అనంత్ పెళ్లికి హోటల్ యజమాని శాంతేరీ నాయక్ వెళ్లారు. పెళ్లిలో ఆమెకు ఎంతో మర్యాద దక్కింది. పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఆమె కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. కేఫ్ మైసూర్‌లో దోసె ధర రూ.170 నుంచి రూ.250 వరకు ఉంది. ఇక, దోసెతోపాటు అంబానీ ఫ్యామిలీ మూంగ్ దాల్ చిల్లాను కూడా ఎంతో ఇష్టంగా తింటారు. వాటిని స్వాతి స్నాక్స్ నుంచి తెప్పించుకుని తింటూ ఉంటారు. ఇలా రిచ్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫుడ్‌కు ఫిదా అయింది.
ఇవి కూడా చదవండి
ర్యాపిడో ఎక్కి భయపడ్డ యువతి.. కొద్దిసేపటి తర్వాత..
నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? ఈ హోమ్ డ్రింక్స్ మీ కోసమే.!