Alia Bhatts Ex Assistant: ఆలియాను దోచేసిన పీఏ.. రూ.77లక్షలు స్వాహా..
ABN , Publish Date - Jul 09 , 2025 | 11:49 AM
Alia Bhatts Ex Assistant: వేదికా ప్రకాశ్ 2021 నుంచి 2024 వరకూ ఆలియా పీఏగా పని చేసింది. ఆలియా తనకు సంబంధించిన అన్ని ఆర్థిక వ్యవహారాలు వేదికాకు అప్పగించింది. ఇదే అదనుగా భావించిన వేదికా ప్రకాశ్ ఫేక్ బిల్లులతో అవకతవకలకు పాల్పడింది.

ముంబై: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్‌ను ఆర్థికంగా మోసం చేసిన కేసులో ఆమె మాజీ పర్సనల్ అసిస్టెంట్ అరెస్టయింది. 32 ఏళ్ల వేదికా ప్రకాశ్ శెట్టి తప్పుడు లెక్కలు రాసి ఏకంగా రూ.77లక్షల దోచేసింది. ఆలియాకు సంబంధించిన నిర్మాణ సంస్థ ‘ఎటర్నల్ సన్‌సైన్’తోపాటు ఆలియా వ్యక్తిగత ఖాతాల్లోంచి కూడా ఆమె డబ్బులు దోచేసినట్లు తేలింది. ప్రకాశ్ శెట్టి 2022 మే నుంచి 2024 ఆగస్టు మధ్య ఈ అవకతవకలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.
వేదికా ప్రకాశ్ శెట్టి తప్పుడు లెక్కలు చూపెడుతోందని ఆలియా తల్లి, ప్రముఖ నటి సోని రజ్‌దాన్ గుర్తించారు. ఈ మేరకు పోలీసులను ఆశ్రయించారు. వేదికా ప్రకాశ్‌పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న వేదికా ప్రకాశ్ పోలీసుల నుంచి తప్పించుకుని తిరగటం మొదలెట్టింది. తరచుగా ఊర్లు మారుతూ ఉండేది.
మొదటగా రాజస్థాన్ నుంచి కర్ణాటక వెళ్లింది. అక్కడి నుంచి పూణేకు వచ్చింది. ఆ వెంటనే బెంగళూరు వెళ్లిపోయింది. బెంగళూరులో ఉన్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ముంబై తీసుకువచ్చారు. కాగా, వేదికా ప్రకాశ్ 2021 నుంచి 2024 వరకూ ఆలియా పీఏగా పని చేసింది. ఆలియా తనకు సంబంధించిన అన్ని ఆర్థిక వ్యవహారాలు వేదికాకు అప్పగించింది. ఇదే అదనుగా భావించిన వేదికా ప్రకాశ్ ఫేక్ బిల్లులతో అవకతవకలకు పాల్పడింది. ఏకంగా రూ.77లక్షలు కాజేసింది. ఆ మొత్తం డబ్బుల్ని ప్రయాణాలు, మీటింగ్స్, మిగిలిన అరేంజ్‌మెంట్స్ చేయడానికి ఖర్చు చేసినట్లు చెప్పింది. ఆలియా తల్లికి అనుమానం వచ్చి లెక్కల్ని చూడటంతో అసలు విషయం బయటపడింది.
ఇవి కూడా చదవండి
అత్తతో ఎఫైర్.. అల్లుడి కొంప ముంచింది..
దేశ వ్యాప్తంగా బంద్.. ఈ రాష్ట్రంలో అధిక ప్రభావం..