AI Robot Green: రష్యా అధ్యక్షుడు పుతిన్ ముందు చిందులేసిన రోబో..
ABN , Publish Date - Nov 20 , 2025 | 08:37 AM
రష్యా హ్యూమనాయిడ్ రోబోట్ ‘గ్రీన్’ అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ ముందు డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్స్ చూసి పుతిన్ ఆశ్చర్యపోయారు. చాలా బాగా డ్యాన్స్ చేశావ్ అంటూ పొగిడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టెక్నాలజీ పరంగా రష్యా దూసుకుపోతోంది. రోజు రోజుకు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోంది. అద్భుతమైన ఆవిష్కరణలకు తెర తీస్తోంది. హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేయటంలో తమకు తామే సాటి అనిపించుకుంటూ ఉంది. బుధవారం రష్యాకు చెందిన సైబర్ బ్యాంక్ ఓ ఎగ్జిబిషన్ నిర్వహించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హ్యూమనాయిడ్ రోబో ‘గ్రీన్’ పుతిన్ ముందు తన ప్రతిభను ప్రదర్శించింది. అచ్చం మనిషిలాగా తనను తాను అధ్యక్షుడికి పరిచయం చేసుకుంది. ఈ సందర్భంగా గ్రీన్ మాట్లాడుతూ..
‘నా పేరు గ్రీన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగిన మొట్ట మొదటి రష్యా హ్యూమనాయిడ్ రోబోట్‌ను నేనే. నేను కేవలం ప్రోగ్రామ్‌ను మాత్రమే కాదు. టెక్నాలజీకి మరో రూపాన్ని’ అని అంది. పుతిన్ ముందు డ్యాన్స్ చేసి చూపించింది. రోబోట్ డ్యాన్స్ చూసి పుతిన్ ఆశ్చర్యపోయారు. ‘డ్యాన్స్ చాలా బాగా చేశావ్’ అంటూ రోబోట్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో గ్రీన్ అచ్చం మనుషుల్లా చేతులు కదిలిస్తూ మాట్లాడుతూ ఉంది.
పుతిన్ బాడీ గార్డ్స్ ఫుల్ అలర్ట్‌లో ఆయన పక్కనే ఉన్నారు. రోబోను ఆయన దగ్గరకు రాకుండా ఉండేలా చూసుకున్నారు. ఇక, సైబర్ బ్యాంక్ ఎగ్జిబిషన్ జరగడానికి కొన్ని రోజుల ముందు మాస్కోలో ఓ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్‌లో ఐడల్ అనే రోబోట్ ప్రదర్శన ఇవ్వడానికి స్టేజి మీదకు వచ్చింది. స్టేజి మీదకు వచ్చిన కొన్ని క్షణాలకే కింద పడిపోయింది. ఐడల్ రోబోట్‌కు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
ఆ సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయనున్న మెటా.. ఆస్ట్రేలియాలో కొత్త రూల్స్..
చలికాలంలో జిమ్‌కి వెళ్లే వారు ఈ తప్పు చేయకండి..!