Share News

AI Generated Clip: ఏఐ అద్భుతం.. వీడియో చూస్తే మతి పోవాల్సిందే..

ABN , Publish Date - Jul 20 , 2025 | 08:30 AM

AI Generated Clip: ఆ వీడియోలో ఓ ఇండియన్ ఫ్యామిలీ పుట్టిన రోజు వేడుక జరుపుకుంటోంది. వాళ్లంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. పిల్లలు కేరింతలు కొడుతున్నారు. ఐదు సెకన్ల ఆ ఏఐ జనరేటెడ్ వీడియో రియాలిటీకి ఏ మాత్రం తీసిపోకుండా ఉంది.

AI Generated Clip: ఏఐ అద్భుతం.. వీడియో చూస్తే మతి పోవాల్సిందే..
AI Generated Clip

అన్ని రంగాల్లో ఏఐ అద్భుతాలు సృష్టిస్తోంది. మనిషి ఊహలకు అందని వాటిని కూడా చేసి చూపిస్తోంది. అసాధ్యాలను, సుసాధ్యం చేస్తోంది. ఒకప్పుడు సినిమా తీయాలంటే గ్రాఫిక్స్ కోసం కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఏఐతో తక్కువ ఖర్చుతో అద్భుతమైన గ్రాఫిక్స్ చేసేయొచ్చు. ఉదాహరణకు ఇంగ్లీష్‌లో సూపర్ హిట్ అయిన హల్క్ క్యారెక్టర్‌తో సినిమా తీయడానికి వందల కోట్లు ఖర్చయింది. కానీ, ఏఐని ఉపయోగించి చిన్న చిన్న యూట్యూబర్లు కూడా అద్భుతంగా హల్క్ వీడియోలు చేస్తున్నారు.


వాటిని చూస్తుంటే వావ్ అనకతప్పదు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తుంటే.. అవి ఒరిజినల్ వీడియోలా.. ఏఐతో క్రియేట్ చేసినవా అని కనుక్కోలేము. అంతలా రియలస్టిక్‌గా ఉంటున్నాయి. తాజాగా, ఏఐతో క్రియేట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జస్టిన్ మూరే అనే మహిళ తన ట్విటర్ ఖాతాలో ఆ వీడియోను షేర్ చేసింది. ‘ఇది నిజమైన ఇంటి వీడియో కాదు. ఏఐని ఉపయోగించి క్యామ్‌క్యాడర్ లేదా పాత ఔట్‌డేటెడ్ ఫోన్‌లో వీడియో తీసినట్లుగా ఉండే వీడియోను క్రియేట్ చేయవచ్చు’ అని పేర్కొంది.


ఆ వీడియోలో ఓ ఇండియన్ ఫ్యామిలీ పుట్టిన రోజు వేడుక జరుపుకుంటోంది. వాళ్లంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. పిల్లలు కేరింతలు కొడుతున్నారు. ఐదు సెకన్ల ఆ ఏఐ జనరేటెడ్ వీడియో రియాలిటీకి ఏ మాత్రం తీసిపోకుండా ఉంది. ఇక, ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఏఐ అద్భుతాలకు పరిమితి లేకుండా పోతోంది. ఆ వీడియో నిజందానిలాగే ఉంది. రియాలిటీకి.. ఆర్టిఫిషియల్‌కు మధ్య ఉన్నా గీతను ఇది చెరిపివేసింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

తల్లి గురించి తప్పుగా మాట్లాడిందని పోలీస్ ప్రియురాలిని..

ఆ మహిళలు.. పాముల్ని చిటికెలో పట్టేస్తారు..

Updated Date - Jul 20 , 2025 | 09:12 AM