Share News

Actress: నటి ఇంట్లో భారీ చోరీ.. 34 లక్షల నగలు దోచేసిన పని మనిషి..

ABN , Publish Date - Apr 29 , 2025 | 02:40 PM

Actress Neha Malik: తన రూములోకి వెళ్లి కప్ బోర్డు చెక్ చేసింది. అక్కడ ఉండాల్సిన కొన్ని నగలు కనిపించలేదు. ఇంట్లో మొత్తం వెతికి చూసింది. కానీ, ఎక్కడా ఆ నగలు కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆమె అంబోలీ పోలీసులను ఆశ్రయించింది.

Actress: నటి ఇంట్లో భారీ చోరీ.. 34 లక్షల నగలు దోచేసిన పని మనిషి..
Actress Neha Malik

అన్నం పెట్టిన ఇంట్లోనే కన్నం వేయటం అంటే ఇదే.. ఓ పని మనిషి తను పని చేసే నటి ఇంట్లో దొంగతనానికి పాల్పడింది. ఏకంగా లక్షలు విలువ చేసే నగల్ని చోరీ చేసింది. నగలతో సహా మాయం అయిపోయింది. విషయం తెలుసుకున్న నటి లబోదిబో మంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బాలీవుడ్ నటి నేహా మాలిక్‌కు ముంబై, ఫోర్ బంగ్లాస్‌లోని ఇంట్లో ఉంటోంది. ఆ ఇంట్లో షెహనాజ్ షేక్ అనే మహిళ పని మనిషిగా పని చేస్తోంది. షెహనాజ్ ఇంట్లో వాళ్లతో ఎంతో నమ్మకంగా ఉండేది.


శుక్రవారం నేహా మాలిక్ తల్లి 65 ఏళ్ల మంజు మాలిక్ గురద్వారా దర్శించుకోవడానికి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో షెహనాజ్ తప్ప ఎవరూ లేరు. మరుసటి రోజు షెహనాజ్ పనికి రాలేదు. ఆమెకు ఫోన్ చేసినా స్పందించలేదు. సమ్ థింగ్ ఈజ్ ఫిషీ అని నేహా తల్లి భావించింది. తన రూములోకి వెళ్లి కప్ బోర్డు చెక్ చేసింది. అక్కడ ఉండాల్సిన కొన్ని నగలు కనిపించలేదు. ఇంట్లో మొత్తం వెతికి చూసింది. కానీ, ఎక్కడా ఆ నగలు కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆమె అంబోలీ పోలీసులను ఆశ్రయించింది.


షెహనాజ్ మీద కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక, ఈ సంఘటనపై అంబోలీ పోలీస్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ.. ‘ మేము దొంగతనం కేసు నమోదు చేశాము. షేక్ మీద 306 సెక్షన్ కింద కేసు నమోదైంది’ అని అన్నారు. నేహా ఇంట్లోని సీసీటీవీ కెమెరా దృశ్యాలను చూస్తున్నారు. పరారీలో ఉన్న నిందితురాలి కోసం అన్వేషిస్తున్నారు. ఇక, నేహా మాలిక్ సినిమా సంగతుల విషయానికి వస్తే.. 2020లో గందీ ఫెర్ ఆ గయా.. అదే సంవత్సరం ముసాఫిర్, 2021 సంవత్సరంలో పింకీ మోగే వాలీ 2 సినిమాలో నటించింది.


ఇవి కూడా చదవండి

Parenting Tips on Money: పిల్లలకు డబ్బు గురించి ఈ 5 విషయాలు అస్సలు చెప్పకండి..

Gold : బంగారం ధరించే ముందు ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి..

Updated Date - Apr 29 , 2025 | 02:44 PM