Aadhaar Updates: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా.. నేటి నుంచి చాలా ఈజీ!
ABN , Publish Date - Nov 01 , 2025 | 07:13 AM
ఈ రోజు నుంచి దేశ ప్రజలకు ఆధార్ ఇక్కట్లు తొలగిపోనున్నాయి. ఇక, ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు వేగంగా, సులభంగా చేసుకోవచ్చు. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)..
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజు (నవంబర్ 1, 2025) నుంచి దేశ ప్రజలకు ఆధార్ ఇక్కట్లు తొలగిపోనున్నాయి. ఇక, ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు వేగంగా, సులభంగా మారనున్నాయి. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ అప్‌డేట్‌లను వేగంగా, సులభంగా, పూర్తిగా డిజిటల్‌గా చేసే అనేక ముఖ్యమైన మార్పులను నేటి నుంచి తీసుకొచ్చింది.
దేశ ప్రజలు తమ పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్ వంటి కీలక సమాచారాన్ని ఇక ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించాల్సిన అవసరం ఉండదు. అక్కడ క్యూలలో నిలబడాల్సిన పని లేదు.
గతంలో, ఆధార్ దిద్దుబాట్లు లేదా అప్డేట్ చేసుకోడానికి ఆధార్ సేవా కేంద్రానికి వ్యక్తిగతంగా వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇక నుంచి మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లో పూర్తి చేయొచ్చు. పాన్ కార్డులు, పాస్‌పోర్ట్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు లేదా రేషన్ కార్డులు వంటి ప్రభుత్వ పత్రాలతో సహా వినియోగదారులు ఇచ్చే సమాచారం డిజిటల్‌గా ధృవీకరిస్తారు. ఇది అప్డేట్స్ ప్రాసెస్ ను వేగవంతం చేసి ప్రజలకు త్వరితగతిన పని పూర్తియ్యే పరిస్థితిని కల్పిస్తుంది.
మరోవైపు, నేటి నుండి ఆధార్ సేవల కోసం వసూలు చేసే చార్జీలను UIDAI పెంచింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
పేరు, చిరునామా లేదా మొబైల్ నంబర్ మార్చుకోడానికి: రూ. 75 వసూలు చేస్తారు.
బయోమెట్రిక్స్ (వేలిముద్ర, ఐరిస్ స్కాన్ లేదా ఫోటో) మార్పులకు: రూ. 125
5-7 సంవత్సరాల వయసు, 15-17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు బయోమెట్రిక్ మార్పులు ఫ్రీ గా చేస్తారు
జూన్ 14, 2026 వరకు ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్డేట్స్ ఉచితం. ఆ తర్వాత రూ. 75 చెల్లించాలి
ఆధార్ రీ ప్రింట్ తీసుకోవాలంటే: రూ. 40 చెల్లించాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి:
వేల కోట్ల విలువైన ఐపీవోల విడుదల.. ఎప్పుడంటే..?
ప్రభుత్వ బ్యాంకుల్లోకి 49శాతం విదేశీ పెట్టుబడులు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి