Share News

Shocking: కార్పొరేట్ జాబ్ వదిలేశాడు.. చివరకు అతడు చేస్తున్న పని ఏంటో తేలిస్తే షాక్

ABN , Publish Date - Jun 14 , 2025 | 06:47 PM

మన దేశంలో విద్యార్థులందరూ కార్పొరేట్ కొలువులు సంపాదించాలని కలలు కంటారు. లక్షల్లో జీతం, ఏసీ ఆఫీస్‌లు, ఇతర సౌకర్యాలు అందించే కార్పొరేట్ కంపెనీల్లో పని చేయాలని ఆశపడుతుంటారు. అయితే కార్పొరేట్ ఉద్యోగం బయటకు కనిపించేంత విలాసవంతంగా ఉండదని కొందరు అంటూ ఉంటారు.

Shocking: కార్పొరేట్ జాబ్ వదిలేశాడు.. చివరకు అతడు చేస్తున్న పని ఏంటో తేలిస్తే షాక్
Rapido bike

మన దేశంలో విద్యార్థులందరూ కార్పొరేట్ కొలువులు (corporate job) సంపాదించాలని కలలు కంటారు. లక్షల్లో జీతం, ఏసీ ఆఫీస్‌లు, ఇతర సౌకర్యాలు అందించే కార్పొరేట్ కంపెనీల్లో పని చేయాలని ఆశపడుతుంటారు. అయితే కార్పొరేట్ ఉద్యోగం బయటకు కనిపించేంత విలాసవంతంగా ఉండదని కొందరు అంటూ ఉంటారు. వెంటాడే టార్గెట్లు, బాస్ వేధింపులు, విపరీతమైన ఒత్తిడితో ఎంతో మంది ఉద్యోగులు సతమతమవుతుంటారు. దీంతో కొంత మంది ఆ ప్రపంచం నుంచి బయటపడాలని ప్రయత్నిస్తుంటారు (Viral News).


అలాంటి ఒక ధైర్యవంతుడు తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని స్వంతంగా వ్యాపారం చేయాలని ప్రయత్నించాడు. ఉద్యోగాన్ని వదిలేసి నా స్వంత వ్యాపారాన్ని ప్రారంభించి ప్రపంచాన్ని షేక్ చేస్తాను అని స్నేహితులకు గొప్పగా చెప్పుకున్నాడు. అయితే బయట అవకాశాలు మరింత క్లిష్లంగా మారాయి. దీంతో అతడు ప్రస్తుతం రాపిడో (Rapido) బైక్ నడుపుకుంటున్నాడు. గతంలో అతడితో పనిచేసిన స్నేహితుడు అతడిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.


'ఈ బైక్ నడుపుతున్న వ్యక్తి నా చిన్ననాటి స్నేహితుడు. అతడు నాతో పాటు ఒక కార్పొరేట్‌ కంపెనీలో పనిచేసేవాడు. గత నెలలో, అతను తన ఉద్యోగాన్ని వదిలివేసి, తన సొంత వ్యాపారం ప్రారంభిస్తానని చెప్పాడు. ఇప్పుడు అతను రాపిడో బైక్ నడపడం ప్రారంభించాడు. రాపిడో బైక్ నడపడంలో అతనికి ఎంత ఆనందం లభిస్తుందో నాకు తెలియదు' అంటూ ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Optical Illusion Test: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫొటోలో 995ల మధ్యనున్న 999ను 9 సెకెన్లలో కనిపెట్టండి..

Crocodile Video: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చిరుత ముందు మొసలి బలం ఏమైందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 14 , 2025 | 06:47 PM