Share News

Viral Video: భర్త సర్‌ప్రైజ్.. భార్య ఎమోషనల్

ABN , Publish Date - May 28 , 2025 | 08:02 PM

Husband Surprise Gift: నిజం చెప్పాలంటే.. చిన్న చిన్న పనులు కూడా బంధాన్ని మరింత బలంగా మారుస్తాయి. ఆడవాళ్లు సున్నిత మనస్కులు కాబట్టి.. భర్తలు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. హ్యాండిల్ విత్ కేర్ అన్నట్లుగా ఉండాలి.

Viral Video: భర్త సర్‌ప్రైజ్.. భార్య ఎమోషనల్
Husband Surprise Gift

ప్రణయం మధురం కలహం మధురం
క్షణమో సగమో విరహం మధురం
సరసం మధురం విరసం మధురం
చికురం మధురం చుబకం మధురం .
..

ఈ పాటతో భార్యాభర్తల బంధం ఎలా ఉండాలో వేటూరి సుందర రామ్మూర్తి అద్భుతంగా చెప్పారు. షాక్ సినిమాలోని ఈ పాట వింటున్నా.. వీడియో చూస్తున్నా.. మనసులో గిలిగింతలు మొదలవుతాయి. ముఖ్యంగా పెళ్లికాని వారు కాబోయే తమ భాగస్వామితో జీవితాన్ని ఊహించేసుకోకమానరు. ప్రేమ పెళ్లి కావచ్చు.. పెద్దలు కుదిర్చిన పెళ్లి కావచ్చు.. భార్యా భర్తల బంధం సాఫీగా సాగాలంటే కమ్యూనికేషన్ సరిగా ఉండాలి. ‘నువ్వు చేసిన వంట రుచిగా ఉంది’ అని భర్త చెప్పలేనపుడు.. ‘ ఈ షర్టులో మీరు అందంగా ఉన్నారు’ అని భార్య పొగడలేనపుడు.. ఆ బంధంలో పెద్దగా పస ఉండదు.


అతిగా ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. అవసరం ఉన్నపుడు దాచుకోకుండా ప్రేమను వ్యక్త పరిస్తే చాలు ఆ బంధం కలకాలం సాగుతుంది. నిజం చెప్పాలంటే.. చిన్న చిన్న పనులు కూడా బంధాన్ని మరింత బలంగా మారుస్తాయి. ఆడవాళ్లు సున్నిత మనస్కులు కాబట్టి.. భర్తలు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. హ్యాండిల్ విత్ కేర్ అన్నట్లుగా ఉండాలి. అప్పుడే ఆడవాళ్లు సంతోషంగా ఉండి.. మనల్ని సంతోష పెడతారు. తాజాగా, ఓ భర్త ఇచ్చిన చిన్న సర్‌ప్రైజ్‌కు అతడి భార్య ఎమోషనల్ అయింది.


భర్త ఆమెకేమీ విలువైన వజ్రాల ఆభరణాలు.. ఖరీదైన కార్లు గిఫ్ట్‌గా ఇవ్వలేదు. ఆమె వండిపెట్టిన క్యారియర్ బాక్సులో భోజనం తిని.. దాన్ని ఖాళీగా తీసుకురాకుండా.. అందులో గులాబి పువ్వు.. కొన్ని చాక్లెట్లు పెట్టాడు. వాటిని చూసి ఆ ఇళ్లాలు ఎంతో సంతోషించింది. శ్రీ సత్య అనే యువతి తన ఎక్స్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది. ఆ పోస్టు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ భర్తను ప్రశంసిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఇద్దరిదీ ప్రేమ వివాహం.. భార్యను అత్యంత దారుణంగా..

పహల్గామ్ దాడికి కారణం ఎవరో చెప్పిన మాజీ పాక్ ఆర్మీ మేజర్

Updated Date - May 28 , 2025 | 08:36 PM