Share News

Shocking: అర్ధరాత్రి గురక పెట్టి నిద్రపోతున్న వ్యక్తి.. హఠాత్తుగా భారీ శబ్దం.. లేచి చూస్తే షాక్..

ABN , Publish Date - Feb 19 , 2025 | 06:44 PM

ఆ వ్యక్తి ఎప్పటిలాగానే హాయిగా తన ఇంటి బెడ్రూమ్‌లో నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి సమయంలో అతడు మంచి నిద్రలో ఉండగానే ఎదో పెద్ద శబ్దం వచ్చింది. తన మంచంపై ఏదో పడినట్టు అనిపించింది.. కళ్లు తెరిచి చూసే సరికి ఆ వ్యక్తికి దిమ్మతిరిగి పోయే షాక్ తగిలింది.. ఎందుకంటే..

Shocking: అర్ధరాత్రి గురక పెట్టి నిద్రపోతున్న వ్యక్తి.. హఠాత్తుగా భారీ శబ్దం.. లేచి చూస్తే షాక్..
Bed

ఆ వ్యక్తి ఎప్పటిలాగానే హాయిగా తన ఇంటి బెడ్రూమ్‌లో నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి సమయంలో అతడు మంచి నిద్రలో ఉండగానే ఎదో పెద్ద శబ్దం వచ్చింది. తన మంచంపై ఏదో పడినట్టు అనిపించింది.. కళ్లు తెరిచి చూసే సరికి ఆ వ్యక్తికి దిమ్మతిరిగి పోయే షాక్ తగిలింది.. ఎందుకంటే అతడి ఎదురుగా ఓ భారీ కొండచిలువ అతడి వైపే చూస్తే కనిపించింది.. అంత దగ్గరగా కొండచిలువను (Python) చూసి అతడికి నిద్రమత్తు వదలిపోయింది.. ఆస్ట్రేలియా (Australia)లోని క్వీన్స్‌ల్యాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.


ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌‌కు చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లో నిద్రపోతుండగా, ఓ భారీ కొండచిలువ పైకప్పు ద్వారా లోపలికి ప్రవేశించింది. అక్కడి నుంచి నేరుగా అతడు నిద్రపోతున్న మంచంపై పడింది. హఠాత్తుగా శబ్దం రావడంతో అతడికి మెలకువ వచ్చింది. వెంటనే అతడు బిగ్గరగా కేకలు వేస్తూ అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే రెస్క్యూ సిబ్బందికి కాల్ చేసి విషయం చెప్పారు. వెంటనే రెస్క్యూ టీమ్ అక్కడకు చేరుకుంది. వారు వచ్చేటప్పటికి ఆ కొండచిలువ ఆ మంచం మీద హాయిగా విశ్రాంతి తీసుకుంటోంది. కొండచిలువను జాగ్రత్తగా పట్టి అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేశారు.

python.jpg


ఆ రెస్క్యూ టీమ్ ఆ కొండచిలువను జాగ్రత్తగా పట్టి అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేశారు. ఆస్ట్రేలియాలో కొండచిలువలు, ఇతర పాములు ఇలా ఇళ్లలోకి ప్రవేశించడం సర్వసాధారణం. ముఖ్యంగా వేసవిలో నీడ కోసం, చల్లని ప్రదేశాలను వెతుక్కుంటూ అవి ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. అయితే, కొండచిలువ అకస్మాత్తుగా ఇలా ఒకరి మంచం మీద పడటం మాత్రం చాలా అరుదైన సందర్భం.

ఇవి కూడా చదవండి..

Rooster: కోడి నా జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తోంది.. కేరళ వాసి ఫిర్యాదుపై అధికారులు ఏం చేశారంటే..


Baba Ramdev: 59 ఏళ్ల వయసులో ఇంత సామర్థ్యం ఏంటి స్వామి.. పరుగు పందెంలో గుర్రాన్ని మించిన బాబా రాందేవ్..


Viral Video: ఛీ.. ఛీ.. పేద వాడిని కూడా వదలరా? రైల్లో ఈ ప్రయాణికుల తీరు చూస్తే కోపం రాకమానదు..


Optical Illusion: మీ కళ్లు నిజంగా పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో సీతాకోకచిలుకను 5 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 19 , 2025 | 06:46 PM