Dog Saves Woman: హార్ట్ టచింగ్ వీడియో.. ప్రమాదాన్ని ముందుగానే గ్రహించి యజమాని ప్రాణాలు కాపాడిన కుక్క
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:40 PM
హార్ట్ టచింగ్ వీడియో ఇది.. ప్రమాదాన్ని ముందుగానే గ్రహించిన ఒక పెంపుడు కుక్క, తన యజమానిని కారు ప్రమాదం నుంచి కాపాడింది. ఈ దృశ్యాలు మొత్తం సీసీ టీవీలో రికార్డ్ కావడంతో ఈ అపురూపమైన ఘటన అందరి ముందుకు వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: కుక్కలు విశ్వాసానికి మారుపేరన్నది అందరికీ తెలిసిందే. ఇది ఎన్నో సందర్భాల్లో నిరూపితం కూడా అయింది. ఇక, పెంపుడు శునకాల సంగతి చెప్పనక్కర్లేదు. తమ యజమానుల పట్ల అవి అంత ప్రేమగా వ్యవహరిస్తుంటాయి. అయితే, తాజాగా జరిగిన ఒక ఘటన అందర్నీ ఆశ్చర్యపర్చే విధంగా ఉంది. జంతువులు ప్రమాదాల్ని ముందుగా పసిగట్టగలవనే దానికి రుజువుగా, రాబోయే ప్రమాదం నుంచి తన యజమానురాలిని రక్షించి, ఆమె ప్రాణాల్ని కాపాడగలిగింది ఆ పెంపుడు కుక్క. అదీ తన ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ.
సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ ఘటన అందరి మనసులను కదిలిస్తోంది. తన యజమానురాలు బాల్కనీలో ఆరు బయట కుర్చీలో కూర్చుని ఉంది. ఆమె పక్కనే కుక్క కూడా సేదతీరుతోంది. అయితే, ఒక్క సారిగా లేచిన కుక్క తన యజమానురాలి మీదుగా వెళ్లి ఆమెను అప్రమత్తం చేసి పక్కకు నెట్టగలిగింది. అంతే, క్షణాల్లో వేగంగా వచ్చిన కారు వాళ్లకి అతి దగ్గరగా గోడని ఢీ కొట్టింది. వాహన ప్రమాదం నుంచి కేవలం కొన్ని సెంటీమీటర్ల దూరంలో దాటిపోయి రెండు ప్రాణాలు నిలిచాయి. కొంచెం అటు ఇటు అయినా, ముందుగా కుక్క ప్రాణాలు, తర్వాత యజమానురాలి ప్రాణాలు దక్కేవి కాదు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ సంఘటన ఎక్కడ జరిగిందన్న వివరాలు లేకపోయినా, ఈ వీడియో కుక్కల మానవత్వానికి, వాటి విశ్వసనీయతకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ఆ మూగ ప్రేమమూర్తి రక్షణ మీరూ చూడండి..
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్‌లో బీజేపీ-మజ్లిస్ మధ్యే పోటీ
Read Latest Telangana News and National News