Share News

Old Age Home Love: వృద్ధాశ్రమంలో ప్రేమ.. 79 ఏళ్ల వయసులో పెళ్లి..

ABN , Publish Date - Jul 10 , 2025 | 01:03 PM

Old Age Home Love: జులై 7వ తేదీన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు, సిటీ మేయర్ ఎమ్‌కే వర్గీష్‌లతో పాటు పలువురు అధికారులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

Old Age Home Love: వృద్ధాశ్రమంలో ప్రేమ.. 79 ఏళ్ల వయసులో పెళ్లి..
Old Age Home Love

మలయాళంలో ‘1947 ప్రణయం తుడరున్ను’ అనే సినిమా ఉంది. 2024లో విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ఓటీటీలో ‘ప్రణయం 1947’ పేరుతో తెలుగులో డబ్ అయి రిలీజ్ అయింది. తెలుగులో కూడా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా కథ ఏంటంటే.. ఓ రిటైర్డ్ టీచర్‌ను ఆమె కొడుకు వృద్ధాశ్రమంలో పడేస్తాడు. ఆమె ఒంటరితనంతో అల్లాడిపోతుంది. అక్కడ పని చేసే ఓ వృద్ధుడు ఆమెను పెళ్లి చేసుకుంటానని ఏదో జోక్‌గా చెబుతాడు. ఆమె మాత్రం దాన్ని సీరియస్‌గా తీసుకుంటుంది. తర్వాత ఇద్దరికీ పెళ్లి అవుతుంది.


అచ్చం ఇలాంటిదే కాకపోయినా.. కొంచెం అటుఇటుగా ఇలాంటి లవ్ స్టోరీనే కేరళలో చోటుచేసుకుంది. ఓ ఇద్దరు వృద్ధులు .. వృద్ధాశ్రమంలో ప్రేమలో పడ్డారు. 70 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. వృద్ధుల లవ్ మ్యారేజీకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలోని రామవర్మపురంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఓ వృద్ధాశ్రమం ఉంది. 79 ఏళ్ల విజయరాఘవన్ 2019నుంచి ఆ ఆశ్రమంలో ఉంటున్నాడు. 75 ఏళ్ల సులోచన 2024లో ఆశ్రమంలో చేరింది. ఆశ్రమంలో చేరిన కొంత కాలానికే ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది.


ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ప్రేమకు అడ్డుకాని వయసు.. పెళ్లికి కూడా అడ్డుకాదు అని వాళ్లు భావించారు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వాలని నిశ్చయించుకున్నారు. జులై 7వ తేదీన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు, సిటీ మేయర్ ఎమ్‌కే వర్గీష్‌లతో పాటు పలువురు అధికారులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘ప్రేమకు, పెళ్లికి వయసుతో సంబంధం లేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఆశీస్సుల పేరుతో నటిని వేధించిన పూజారి

ప్రతీకారం.. 6 నెలల చిన్నారిని కూడా వదలలేదు..

Updated Date - Jul 10 , 2025 | 01:04 PM