Lion Enclosure Viral Video: లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Dec 01 , 2025 | 06:49 PM
బ్రెజిల్ దేశంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఓ సింహం అతడ్ని కొరికి చంపేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జూలోని లయన్ ఎన్‌క్లోజర్‌లోకి అడుగుపెట్టిన ఓ యువకుడి జీవితం అర్థాంతరంగా ముగిసింది. సింహం అతడ్ని దారుణంగా కొరికి చంపేసింది. ఈ సంఘటన బ్రెజిల్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌లో ‘జాఆవో పెసోఆ’ జూ ఉంది. కొద్దిరోజుల క్రితం 19 ఏళ్ల ఓ యువకుడు ఆ జూకు వెళ్లాడు. సింహాలు ఉన్న ఎన్‌క్లోజర్ దగ్గరకు రాగానే ఎవ్వరూ ఊహించని పని చేశాడు. అనుమతి లేని ప్రదేశంలోకి వెళ్లాడు.
మెల్లగా అక్కడున్న చెట్టు మీద నుంచి సింహాలు ఉండే ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. అతడు చెట్టు దిగుతుండటం ఓ సింహం చూసింది. వెంటనే అతడి దగ్గరకు పరుగులు పెట్టుకుంటూ వచ్చింది. ఇది గమనించిన సందర్శకులు పెద్ద ఎత్తున కేకలు వేయటం మొదలెట్టారు. సింహాన్ని చూసినా కూడా అతడు భయపడలేదు. మెల్లగా కిందకు దిగాడు. అతడు కిందకు రాగానే సింహం అతడిపై దాడి చేసింది. విచక్షణా రహితంగా గాయపరిచింది. సమాచారం అందుకున్న జూ సిబ్బంది హుటాహుటిన ఎన్‌క్లోజర్ దగ్గరకు వెళ్లారు.
అతడ్ని బయటకు తీసుకువచ్చారు. అయితే, తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయాన్ని జూ అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు. సంఘటన ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తునకు ఆదేశించారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అది నిజంగానే జరిగిందా? లేక ఏఐతో తయారు చేసిన వీడియోనా’..‘అతడు మానసిక రోగిలా ఉన్నాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
దంపతుల దారుణం.. గుడి దగ్గర భిక్షమెత్తే మహిళ బిడ్డను..
క్యూట్ ప్రపోజల్.. తన ప్రేయసికి ప్రేమను ఎలా వ్యక్తపరిచాడో చూడండి..