Share News

Youngest Swimmer: ఏడాది వయసులోనే దుమ్ము దులిపేస్తున్న చిన్నది..

ABN , Publish Date - Dec 11 , 2025 | 08:37 AM

ఓ చిన్నారి ఏడాది వయసులోనే రికార్డులు క్రియేట్ చేస్తోంది. బుడిబుడి నడకలు వేసే వయసులో ఈత కొడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంది. కేవలం 10 నిమిషాల 8 సెకన్లలోనే 100 మీటర్ల దూరం ఈత కొట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది.

Youngest Swimmer: ఏడాది వయసులోనే దుమ్ము దులిపేస్తున్న చిన్నది..
Youngest Swimmer

సాధారణంగా ఏడాడి వయసున్న పిల్లలు నడవడానికే ఇబ్బందిపడుతుంటారు. కొన్ని అడుగులు వేయగానే కిందపడిపోతూ ఉంటారు. అలాంటిది ఓ చిన్నారి ఏడాది వయసులోనే రికార్డులు క్రియేట్ చేస్తోంది. బుడిబుడి నడకలు వేసే వయసులో ఈత కొడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంది. కేవలం 10 నిమిషాల 8 సెకన్లలోనే 100 మీటర్ల దూరం ఈత కొట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... రత్నగిరికి చెందిన వేద పరేష్ 2024, జనవరి 22వ తేదీన పుట్టింది. ప్రస్తుతం ఈ చిన్నదాని వయసు సంవత్సరం 9 నెలలా 10 రోజులు మాత్రమే.


ఇంత చిన్న వయసులోనే తల్లిదండ్రులు చిన్నారికి ఈతలో శిక్షణ ఇచ్చారు. తల్లిదండ్రుల శిక్షణలో పాప రాటు దేలింది. ఎంతో అద్భుతంగా ఈత కొట్టడం నేర్చుకుంది. కొద్దిరోజుల క్రితం 100 మీటర్ల దూరాన్ని కేవలం 10 నిమిషాల 8 సెకన్లలో పూర్తి చేసింది. నవంబర్ 25వ తేదీన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పాప రికార్డ్‌ను అధికారికంగా గుర్తించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన ఒకటి విడుదల చేశారు. అందులో.. ‘100 మీటర్లు ఈత కొట్టిన అతి చిన్న వయస్కురాలిగా వేద రికార్డు సృష్టించింది. వేద పరేష్ రత్నగిరిలో జనవరి 22, 2024లో పుట్టింది. రత్నగిరిలోని మున్సిపల్ స్విమ్మింగ్ పూల్‌లో ఈ ఘనత సాధించింది’ అని పేర్కొంది.


ఇక, వేద పరేష్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. పాపకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను వేద తల్లిదండ్రులు ఆ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తూ ఉన్నారు. ఆ పోస్టులు కాస్తా వైరల్‌గా మారుతూ ఉన్నాయి. నిన్న వేద రికార్డ్ గురించి పోస్టు పెట్టగా నెటిజన్లు పెద్ద మొత్తంలో స్పందిస్తూ ఉన్నారు. ‘ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. పాప చాలా గ్రేట్’..‘చిన్న పిల్లలు నడవడానికే ఇబ్బంది పడుతుంటారు. ఈ పాప ఏకంగా ఈత కొట్టేస్తోంది’..‘ వేద పరేష్ చాలా మందికి స్పూర్తిగా నిలుస్తోంది’ అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు.


ఇవి కూడా చదవండి

ఆర్టీసీని మరింత విస్తరిస్తాం.. కొత్తగా 373 కాలనీలకు బస్సులు

భారత్ గొప్ప ఆఫర్లు ఇస్తోంది.. ట్రేడ్ డీల్‌పై అమెరికా ప్రతినిధి ఆసక్తికర వ్యాఖ్యలు..

Updated Date - Dec 11 , 2025 | 08:40 AM