కూకట్‌పల్లి, మూసాపేట్‌లో బోనాలు..
ABN, Publish Date - Jul 17 , 2025 | 08:58 PM
ఆషాఢ మాసం కావడంతో.. తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని వివిధ దేవాలయాల్లో కొలువుదీరిన అమ్మవార్లకు భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు.

ఆషాఢ మాసం కావడంతో.. తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్‌లోని వివిధ దేవాలయాల్లో కొలువుదీరిన అమ్మవార్లకు భక్తులు ఘనంగా బోనాలు సమర్పిస్తున్నారు.

ఆ క్రమంలో జులై 17వ తేదీ.. అంటే గురువారం నాడు కూకట్‌పల్లి, మూసాపేట్ పరిధిలో అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు.

అమ్మవార్లకు బోనాలు సమర్పించేందుకు ఆలయాలకు ఉరేగింపుగా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

కాగా, బోనాలు సమర్పించే మహిళా భక్తులకు ఆలయాల అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.

దేవాలయాలకు పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు.. ఆలయ పూజారి సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బోనాలు సమర్పించేందుకు భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు తమతమ మెుక్కులు చెల్లించుకున్నారు.
Updated at - Jul 17 , 2025 | 09:10 PM