సీఎం చంద్రబాబు జన్మదిన వేళ.. దాతృత్వాన్ని చాటుకున్న మన్నవ మోహన్ కృష్ణ

ABN, Publish Date - Apr 21 , 2025 | 09:59 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకోని.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 75 నిరుపేద కుటుంబాలకు తోపుడు బండ్లను ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ పంపిణీ చేశారు.

సీఎం చంద్రబాబు జన్మదిన వేళ.. దాతృత్వాన్ని చాటుకున్న మన్నవ మోహన్ కృష్ణ 1/8

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం చంద్రబాబు జన్మదిన వేళ.. దాతృత్వాన్ని చాటుకున్న మన్నవ మోహన్ కృష్ణ 2/8

సీఎం చంద్రబాబు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకోని.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 75 నిరుపేద కుటుంబాలకు తోపుడు బండ్లను ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ పంపిణీ చేశారు.

సీఎం చంద్రబాబు జన్మదిన వేళ.. దాతృత్వాన్ని చాటుకున్న మన్నవ మోహన్ కృష్ణ 3/8

అనంతరం మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ..భారత రాజకీయ చరిత్రకు వన్నె తెచ్చన పాలనతో... సమసమాజ మానవత్వపు భావనలతో... కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే అధినేత, తెలుగు వెలుగు నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని నిరుపేదలకు స్వయం ఉపాధి కల్పించే చిరు సాయం అందించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.

సీఎం చంద్రబాబు జన్మదిన వేళ.. దాతృత్వాన్ని చాటుకున్న మన్నవ మోహన్ కృష్ణ 4/8

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న చంద్రబాబునాయుడికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ తెలిపారు.

సీఎం చంద్రబాబు జన్మదిన వేళ.. దాతృత్వాన్ని చాటుకున్న మన్నవ మోహన్ కృష్ణ 5/8

నిరుపేదలకు తోపుడు బళ్లు పంపిణి చేస్తున్న మన్నవ మోహన్ కృష్ణ, ఎమ్మెల్యే గల్లా మాధవితోపాటు పార్టీ శ్రేణులు

సీఎం చంద్రబాబు జన్మదిన వేళ.. దాతృత్వాన్ని చాటుకున్న మన్నవ మోహన్ కృష్ణ 6/8

అలాగే ఈ తోపుడు బళ్ళ ద్వారా ఈ నిరుపేదలు..కూరగాయలు విక్రయించడం, ఇస్త్రీ బండ్లు పెట్టుకోవటం, టిఫిన్ సెంటర్లు పెట్టుకోవటం, పండ్లు అమ్ముకోవటం మొదలగు చిరు వ్యాపారాలు పెట్టుకొని వాటి ద్వారా ఈ పేద కుటుంబాలకు స్వయం ఉపాధి కల్పించి.. వాళ్ల కాళ్ళ మీద వాళ్లు నిలబడటానికి తన వంతు ఈ చిన్న సాయం చెయ్యటం సంతృప్తిగా వుందని మన్నవ మోహన కృష్ణ తెలిపారు.

సీఎం చంద్రబాబు జన్మదిన వేళ.. దాతృత్వాన్ని చాటుకున్న మన్నవ మోహన్ కృష్ణ 7/8

ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి,జోన్ 5 ఇంచార్జి కోవెలముడి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. మన్నవ మోహనకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్‌ను గతంలో ఆయన స్థాపించారు.

సీఎం చంద్రబాబు జన్మదిన వేళ.. దాతృత్వాన్ని చాటుకున్న మన్నవ మోహన్ కృష్ణ 8/8

ఈ ట్రస్ట్ ద్వారా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆ క్రమంలో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు 75 జన్మదినోత్సవాన్ని పురస్కరిచుకొని ఈ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.

Updated at - Apr 21 , 2025 | 10:22 PM