NRI: బాలకృష్ణకు పద్మభూషణ్.. అమెరికాలో సెలబ్రేషన్స్
ABN , Publish Date - Jan 26 , 2025 | 10:58 PM
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు దేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ ప్రకటించడం పట్ల విదేశాల్లోని బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడం సంతోషకరమని..

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు దేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ ప్రకటించడం పట్ల విదేశాల్లోని బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడం సంతోషకరమని అమెరికాలోని బాలకృష్ణ అభిమానులు, ప్రవాస భారతీయులు పేర్కొంటున్నారు. సినీరంగంలో బాలకృష్ణ సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించనుంది. మొత్తం ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించుగా వీరిలో తెలుగు వ్యక్తి బాలకృష్ణను పద్మభూషణ్ పురస్కారం వరించింది. తమ అభిమాన నటుడుకి పద్మ భూషణ్ పురస్కారం రావడంపై అమెరికాలోని బాలయ్య అభిమానులు రామకృష్ణ గుళ్లపల్లి, సుధీర్ చింతమనేని, కేసీ చెరుకూరి, అజయ్ గోవాడ, శ్యామ్ యలమంచిలి, మురళి కొమ్మాలపాటి, చందు కాజ, అనిల్ తన్నీరు సతీష్ కొమ్మన, సతీష్ కోటపాటి, దిలీప్ కుమార్ చండ్ర, బశ్వంత్ కంభంపాటి, బాలు అన్నే, సాయి మద్దిరాల, ఆదిత్య గోగినేని, నిఖిల్ సూరపనేని కిషోర్ కోసరాజు, శ్రీతేజ జాస్తి, సుబ్బు బోయపాటి, ప్రతిభ అభినందనలు తెలిపారు.
వందకు పైగా..
నందమూరి బాలకృష్ణ ఇప్పటివరకు 100కు పైగా చిత్రాల్లో నటించారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా, బసవతారకం క్యాన్సర్స్ ఆస్పత్రి చైర్మన్‌గా ప్రస్తుతం ఆయన సేవలందిస్తున్నారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినీ రంగంలో ప్రవేశించిన బాలకృష్ణ తొలిసారిగా 1974లో తాతమ్మ కల చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. 14 ఏళ్ల వయస్సులోనే తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి నటించారు.సాహసమే జీవితం చిత్రంతో హీరోగా పరిచయమైన బాలకృష్ణ. ఇప్పటి వరకు 109 చిత్రాల్లో నటించారు. చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
అమెరికాలో సెలబ్రేషన్స్
తాము ఎంతగానో అభిమానించే బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం రావడం పట్ల అమెరికాలోని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ వేడుకలు నిర్వహించనున్నారు. బాలయ్య అభిమానులైన ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన టెక్సాస్ లోని లూయిస్ విల్ నగరంలోని లిటిల్ ఇండియాలో నిర్వహించే వేడుకలకు బాలయ్య అభిమానులంతా హాజరు కావాలని నిర్వాహకులు కోరారు.
మరిన్ని వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here