Telugu Library Texas: అమెరికాలో ఘనంగా తెలుగు గ్రంథాలయ వార్షికోత్సవం
ABN , Publish Date - Oct 28 , 2025 | 10:05 AM
అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని మెలిస్సా నగరంలో నిర్మించిన శ్రీ ఎన్.వి.ఎల్ స్మారక తెలుగు గ్రంథాలయ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నలజల నాగరాజు తన తండ్రి నలజల వెంకటేశ్వర్లు స్మారకార్థంగా
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని మెలిస్సా నగరంలో నిర్మించిన శ్రీ ఎన్.వి.ఎల్ స్మారక తెలుగు గ్రంథాలయ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నలజల నాగరాజు తన తండ్రి నలజల వెంకటేశ్వర్లు స్మారకార్థంగా ఈ గ్రంథాలయాన్ని ఏడాది క్రితం ఏర్పాటు చేశారు. ప్రారంభమైన మొదటి సంవత్సరంలోనే శ్రీ ఎన్.వి.ఎల్ స్మారక తెలుగు గ్రంథాలయం, తెలుగు పుస్తక ప్రేమికులకు, సాహిత్యాభిమానులకు ఎంతో చేరువైంది. మొదటి వార్షికోత్సవ వేడుకకు తెలుగు సమాజంలోని అనేకమంది ప్రముఖులు హాజరై ఈ గ్రంథాలయ పాత్రను విశేషంగా కొనియాడారు.

ఈ కార్యక్రమానికి గోపాల్ పోనంగి (శుభం ఫౌండేషన్), సురేష్ మండువ (FISD బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు), మల్లి వేమన (తానా బోర్డు ఆఫ్ ట్రస్టీ), అనంత్ మల్లవరపు (సాహితీవేత్త), చంద్రహాస్ (రచయిత, భాషాభిమాని), విజయ్ తొడుపునూరి (శుభం ఫౌండేషన్), మిమిక్రీ రమేశ్ (కళారంగ ప్రముఖుడు), బాపు నూతి (NATS పూర్వ అధ్యక్షులు, BOD), రవి తాండ్ర (NATS జాయింట్ ట్రెజరర్) కిషోర్ నారె (NATS ) తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంలో మాట్లాడిన అతిథులు, శ్రీ నలజల వెంకటేశ్వర్లు వారి జీవిత స్ఫూర్తిని స్మరించుకుంటూ, ఆయన కుమారుడు నలజల నాగరాజు తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న సేవలను విశేషంగా ప్రశంసించారు. గోపాల్ పోనంగి మాట్లాడుతూ, 'తెలుగు భాషను వ్యాప్తి చేయడంలో ఈ గ్రంథాలయం కీలక పాత్ర పోషిస్తోంది' అని పేర్కొన్నారు. సురేష్ మండువ 'పుస్తకాల పఠనం విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంచి, వారిని భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దుతుంది' అని అన్నారు. మల్లి వేమన 'డల్లాస్ ప్రాంతంలోని తెలుగువారికి ఇది ఒక సాంస్కృతిక కేంద్రం' అని కొనియాడారు.

అనంత్ మల్లవరపు, చంద్రహాస్ వంటి సాహిత్య ప్రముఖులు మాట్లాడుతూ, 'తెలుగు పుస్తకాలు మన సంస్కృతి మూలాలను తదుపరి తరాలకు చేరవేసే వంతెన. ఈ గ్రంథాలయం ఆ బాధ్యతను ఎంతో సమర్థంగా నిర్వర్తిస్తోంది' అని అభిప్రాయపడ్డారు. అలాగే NATS నాయకులు బాపు నూతి, రవి తాండ్ర మాట్లాడుతూ, భవిష్యత్తులో ఈ గ్రంథాలయం మరింత విస్తరించడానికి తమ సంస్థ పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్‌లో బీజేపీ-మజ్లిస్ మధ్యే పోటీ
Read Latest Telangana News and National News