Beauty Hacks: పుట్టుమచ్చలను దాచి...
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:06 AM
ముఖం మీది పుట్టుమచ్చలు పెద్దవిగా, వికారంగా ఉంటే, వాటిని మేక్‌పతో దాచేసుకోవచ్చు.

ముఖం మీది పుట్టుమచ్చలు పెద్దవిగా, వికారంగా ఉంటే, వాటిని మేక్‌పతో దాచేసుకోవచ్చు. అందుకోసం ఎలాంటి మేకప్ మెలకువలు పాటించాలో తెలుసుకుందాం!
పుట్టుమచ్చలను మేక్‌పతో దాచేయడం కోసం ఫౌండేషన్, కన్‌సీలర్ వాడుకుంటే సరిపోదు. అందుకోసం ప్రత్యేకమైన మెలకువలు పాటించాలి. అవేంటంటే....
చర్మాన్ని సిద్ధం చేయాలి: ముఖాన్ని సుభ్రంగా కడుక్కుని, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. తర్వాత ప్రైమర్ సహాయంతో ముఖాన్ని తదుపరి మేక్‌పకు సిద్ధం చేయాలి
కలర్ కరెక్ట్: ముదురు రంగు పుట్టుమచ్చలు చర్మంలో కలిసిపోయేలా చేయడం కోసం గోధుమ రంగు టోన్‌ను ఎంచుకోవాలి. ఎరుపు రంగు పుట్టుమచ్చల కోసం ఆకుపచ్చ టోన్ ఎంచుకోవాలి
చిన్న బ్రష్: చదునుగా ఉండే చిన్న బ్రష్‌ను కరెక్టర్‌లో ముంచి, పుట్టుమచ్చ మీద నేరుగా అద్దుకోవాలి
కన్‌సీలర్: చర్మపు రంగుకు దగ్గరగా ఉండే కన్‌సీలర్ ఎంచుకోవాలి. కరెక్టర్ అద్దిన ప్రదేశంలోనే కన్‌సీలర్ అప్లై చేయాలి. తర్వాత బ్రష్‌తో లేదా వేలితో మృదువుగా అడుగున ఉన్న కలర్ కరెక్టర్ చెదిరిపోకుండా కన్‌సీలర్ అంచులను చర్మంలో కలిసిపోయేలా అద్దుకోవాలి ట్రాన్స్‌క్యులెంట్ పౌడర్: కన్‌సీలర్ అద్దుకున్న ప్రదేశం మీద ట్రాన్స్‌క్యులెంట్ పౌడర్‌ను అద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో ముడతలు ఏర్పడకుండా ఉంటాయి
ఫౌండేషన్: కన్‌సీలర్ సెట్ అయిన తర్వాత, యధాతథంగా ఫౌండేషన్ అప్లై చేసి, చర్మం మీద సమంగా పరుచుకునేలా అద్దుకోవాలి
చిన్న మొత్తాల్లో: ఒకేసారి ఎక్కువ మోతాదు కన్‌సీలర్ లేదా ఫౌండేషన్ అప్లై చేయకుండా చిన్న మొత్తాల్లో తీసుకుని అద్దుకుంటూ సహజసిద్ధంగా చర్మంలో కలిసిపోయేలా నేర్పరితనంతో వ్యవహరించాలి
సెట్టింగ్ స్ర్పే: మేకప్ రోజంతా చెక్కుచెదరకుండా ఉండడం కోసం సెట్టింగ్ స్ర్పే వాడుకోవాలి.