Hydrated Glow: తేమతో తళుక్కుమనేలా
ABN , Publish Date - Jun 21 , 2025 | 12:03 AM
తేమతో నవనవలాడే చర్మం అందరి సొంతం కాదు. కొందరి చర్మం ఎన్ని జాగ్రత్తలు పాటించినా తేమ కోల్పోయి, పొడిబారిపోతూ ఉంటుంది. అలాంటి చర్మం కలిగిన వాళ్లు మేక్‌పతో లోపాన్ని సరిదిద్దుకోవచ్చు.

తేమతో నవనవలాడే చర్మం అందరి సొంతం కాదు. కొందరి చర్మం ఎన్ని జాగ్రత్తలు పాటించినా తేమ కోల్పోయి, పొడిబారిపోతూ ఉంటుంది. అలాంటి చర్మం కలిగిన వాళ్లు మేక్‌పతో లోపాన్ని సరిదిద్దుకోవచ్చు.
మృతకణాలు తొలగించి
చర్మం మీద మృతకణాలు పేరుకుపోయినా, చర్మం గరుకుగా మారి, పొడిబారిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. అందుకోసం చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తూ, నునుపుగా మార్చుకోవాలి. అందుకోసం ఉపయోగించే స్క్రబ్ చర్మానికి హాని కలిగించనిదై ఉండాలి.
తేమను పెంచే సీరం
చర్మానికి తేమను అందించి, మేక్‌పకు అనువుగా మార్చడం కోసం తప్పనిసరిగా హైడ్రేటింగ్ సీరం వాడుకోవాలి. ఈ సీరంను క్రమం తప్పక వాడితే, చర్మంలో జీవ కళ ఉట్టిపడడంతో పాటు, సుతిమెత్తగా, కాంతివంతంగా తయారవుతుంది.
ప్రైమర్
ఫౌండేషన్‌కు ముందు ముఖానికి ప్రైమర్ పూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మేకప్ ఎక్కువ సమయం పాటు చెక్కుచెదరకుండా ఉంటుంది. అలాగే చర్మంలోని తేమ తరిగిపోకుండా కాపాడుతుంది.
ఫౌండేషన్ ఫార్ములా
చర్మానికి తేమనందించే, ద్రవ రూప ఫౌండేషన్‌ను మాత్రమే వాడుకోవాలి. అతిగా మ్యాట్ తత్వం కలిగి ఉండే ఫౌండేషన్‌తో చర్మం మరింత పొడిబారుతుంది. క్రీమ్ రూపంలో ఉండే ఫౌండేషన్ వాడాలనుకుంటే, చర్మంలో ఇంకిపోయి, చర్మపు రంగులో కలిసిపోయేలా ఉండే నాణ్యమైన లిక్విడ్ ఫౌండేషన్‌నే ఎంచుకోవాలి.
మేకప్ స్పాంజ్
బ్లష్, ఐ షాడోలకు బ్రష్‌లు అనువైనవే అయినప్పటికీ, పొడి చర్మం కలిగిన వాళ్లు ఫౌండేషన్ అప్లికేషన్ కోసం తడిపిన స్పాంజ్‌ను ఉపయోగించడమే మేలు. తడి స్పాంజితో చర్మానికి అదనపు హైడ్రేషన్ కూడా దక్కుతుంది.అలాగే చర్మపు ముడతల్లో, గీతల్లో మేకప్ ఇరుక్కుపోకుండా ఉండాలంటే తడి స్పాంజ్‌తోనే ఫౌండేషన్ వేసుకోవాలి.
పౌడర్
పొడి చర్మానికి పౌడర్లు నప్పవు. అయితే మేకప్ సెట్ చేయడం కోసం అద్దుకునే పౌడర్, తేలికగా ఉండేలా చూసుకోవాలి.