Pankhuri Tripathi Fee Waiver: బాలికకు సీఎం యోగి హామీ.. లెక్కచెయ్యని స్కూలు యాజమాన్యం..
ABN , Publish Date - Jul 07 , 2025 | 12:42 PM
Pankhuri Tripathi Fee Waiver: ముఖ్యమంత్రి యోగి కూడా సానుకూలంగా స్పందించాడు. పంఖురి స్కూలుకు కట్టాల్సిన 18 వేల రూపాయలు మాఫీ చేయిస్తామని హామీ ఇచ్చారు. అయితే, స్కూలు మాత్రం డబ్బులు మాఫీ చేయడానికి ఒప్పుకోలేదు.

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని ఓ స్కూలు యాజమాన్యం లెక్కచేయలేదు. ‘సీఎం చెబితే భయపడాలా?’ అన్నట్లు వ్యవహరించింది. ఓ బాలికకు ఆయన ఇచ్చిన మాటను పట్టించుకోలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. గోరఖ్‌పూర్, పక్కీబాగ్‌కు చెందిన పంఖురి త్రిపాఠీ.. సరస్వతీ శిశు మందిర్‌లో 7వ తరగతి చదువుతోంది. ఆ స్కూలు ఆర్ఆర్ఎస్‌కు చెందిన విద్యా భారతి ఆధ్వర్యంలో నడుస్తోంది. ఆ స్కూలులో చదివే ఏడవ తరగతి విద్యార్థులు నెలకు 1650 రూపాయలు చెల్లించాలి.
పంఖురి త్రిపాఠీ చాలా నెలల నుంచి ఫీజులు కట్టడం లేదు. ఆమె తండ్రి రాజీవ్ కుమార్ త్రిపాఠీ కాలికి కరోనా సమయంలో గాయం అయింది. ఆ గాయం కారణంగా ఉద్యోగం చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కుటుంబం ఆర్థికంగా బాగా దిగజారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమె గత కొన్ని నెలలనుంచి స్కూలు ఫీజు కట్టలేదు. దాదాపు 18 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే, ఇంత డబ్బు కట్టడం తమ వల్ల కాదని పంఖురి కుటుంబానికి అర్థమైంది. ఈ నేపథ్యంలోనే పంఖురి త్రిపాఠి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసింది.
కుటుంబ సమస్యల్ని, చదువుపై తనకున్న ఇష్టాన్ని ఆయనకు చెప్పింది. ఆర్థిక సాయం చేస్తే.. ఐఏఎస్ అవుతానని అంది. ముఖ్యమంత్రి యోగి కూడా సానుకూలంగా స్పందించాడు. పంఖురి స్కూలుకు కట్టాల్సిన 18 వేల రూపాయలు మాఫీ చేయిస్తామని హామీ ఇచ్చారు. అయితే, స్కూలు మాత్రం డబ్బులు మాఫీ చేయడానికి ఒప్పుకోలేదు. ‘ఒక పాపకు ఫీజు మాఫీ చేస్తే.. మిగిలిన వాళ్లు కూడా ఫీజు మాఫీ కావాలంటారు. అలా చేస్తే స్కూలు మూసుకోవాలి’ అని తేల్చి చెప్పింది. పంఖురి ఫ్యామిలీ బాధలో మునిగిపోయింది. ఇలాంటి సమయంలో పంఖురి కోసం సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ రంగంలోకి దిగారు. తాను సాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
ప్రేమ పెళ్లి.. ప్రతీ రోజూ గొడవలే.. కట్ చేస్తే..