Body In Trolley Bag: దుబాయ్ నుంచి వచ్చి 10 రోజులు.. అంతలోనే శవమై..
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:09 PM
Body In Trolley Bag: భర్తను చంపిన తర్వాత దాన్ని ముక్కలుగా చేసి ట్రాలీ బ్యాగులో కక్కారు. ఆ ట్రాలీ బ్యాగులో 50 కిలోమీటర్ల దూరంలో పడేశారు. ఓ రైతు ఆ బ్యాగును చూశాడు. అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు అక్కడికి వచ్చి బ్యాగును ఓపెన్ చేసి చూశారు. అందులో వ్యక్తి శవం బయటపడింది.

మగాళ్లపై దారుణాలకు పాల్పడుతున్న ఆడవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రియుళ్ల సాయంతో భర్తలను చంపుతున్న భార్యల సంఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సంచలనం సృష్టించిన మీరట్‌కు చెందిన సౌరభ్ మర్డర్ కేసు తరహాలో చాలా జరిగాయి. భర్తలను చంపి, ముక్కలు చేసి దేంట్లోనైనా కుక్కి బయటపడేయటం మామూలైపోయింది. తాజాగా, ఓ భార్య తన భర్తను ప్రియుడి సాయంతో చంపేసింది. భర్త శవాన్ని ట్రాలీ బ్యాగులో కుక్కి 50 కిలోమీటర్ల దూరంలో పడేసింది. భర్త దుబాయ్ నుంచి ఇంటికి వచ్చిన 10 రోజుల్లోనే భార్య ఈ దారుణానికి పాల్పడింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, డియోరియా జిల్లా, భతౌలీ గ్రామానికి చెందిన నౌషాద్ అహ్మద్, రజియా భార్యాభర్తలు. రజియాకు అదే ప్రాంతానికి చెందని ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా ఊరందరికీ తెలిసింది. అక్రమ సంబంధంపై పంచాయతీ జరిగింది. ప్రియుడికి దూరంగా ఉంటానని, ఇకపై కలవనని నజియా పంచాయతీ పెద్దలకు చెప్పింది. అయితే, నౌషాద్ దుబాయ్ వెళ్లిపోయిన కొన్ని రోజులకే ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. తరచుగా ఇద్దరూ ఏకాంతంగా కలుసుకునేవారు. 10 రోజుల క్రితం నౌషాద్ ఇండియాకు తిరిగి వచ్చాడు. నజియా ఆమె ప్రియుడు కలుసుకోవటం ఇబ్బందిగా మారిపోయింది.
ఈ నేపథ్యంలోనే నౌషాద్ అడ్డుతొలగించుకోవాలని ఇద్దరూ భావించారు. పక్కాప్లాన్ ప్రకారం అతడ్ని చంపేశారు. శవాన్ని ముక్కలు చేసి, ట్రాలీ బ్యాగులో కుక్కారు. ఆ బ్యాగును ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే. పత్కౌలీ గ్రామంలోని పొలాల్లో పడేశారు. జితేంద్ర గిరి అనే రైత ఆ బ్యాగును చూశాడు. అతడికి అనుమానం రావటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాలీ బ్యాగులో శవాన్ని గుర్తించారు. శవంతో పాటు దొరికిన ఆధారాలతో ఆ శవం నౌషాద్‌దని కనుగొన్నారు. నజియాను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది. నజియా లవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం
Pop Francis: ఇంకొన్ని నెలల్లో భారత్ పర్యటన.. ఇంతలోనే పోప్ మరణం..