Share News

Terrace Joke: జోక్ నిజమైంది.. ఓ ప్రాణం పోయింది..

ABN , Publish Date - Jul 20 , 2025 | 12:18 PM

Terrace Joke: రెండు నిమిషాల తర్వాత పార్వతి భర్త చేతుల్లోంచి జారిపోయింది. నాల్గవ అంతస్తునుంచి కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడింది. గాయపడ్డ ఆమెను భర్త ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

Terrace Joke: జోక్ నిజమైంది.. ఓ ప్రాణం పోయింది..
Terrace Joke

జోక్ నిజమైంది. ఓ నిండు ప్రాణం బలైంది. భర్త కళ్ల ముందే భార్య ప్రాణాలు కోల్పోయింది. టెర్రస్ గోడ మీద నుంచి ఓ మహిళ పట్టుతప్పి కిందపడి చనిపోయింది. ఈ సంఘటన హర్యానాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని గంజామ్ జిల్లాకు చెందిన పార్వతి, ధుర్యోదన రావ్ భార్యాభర్తలు. వీరికి రెండేళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరూ గురుగావ్ వచ్చి సెటిల్ అయ్యారు. అక్కడి డీఎల్‌ఎఫ్ ఫేజ్ 3లో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కాపురం చేసుకునేవారు.


మంగళవారం రోజున పార్వతి టెర్రస్ గోడ మీదకు ఎక్కింది. రెండు కాళ్లు ఒకే వైపు పెట్టి కూర్చుంది. ఆమెకు కొద్ది దూరంలో భర్త నిల్చుని ఉన్నాడు. ఇద్దరూ సరదాగా జోకులు వేసుకుంటూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ‘నేను ఇక్కడినుంచి కిందపడిపోతే .. నన్ను పట్టుకుంటావా.. లేదా..’ అని అడిగింది. ఆ వెంటనే కావాలని వెనక్కు వాలింది. అయితే, అదుపు తప్పి అటు వైపుపడింది. ఆమె గాల్లో ఉండగానే భర్త ఆమె చేతులు పట్టుకున్నాడు. కిందపడుకుండా రెండు నిమిషాల పాటు ఆపగలిగాడు.


సాయం కోసం అర్థించాడు. అయితే, అక్కడ ఎవ్వరూ లేరు. రెండు నిమిషాల తర్వాత పార్వతి భర్త చేతుల్లోంచి జారిపోయింది. నాల్గవ అంతస్తునుంచి కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడింది. గాయపడ్డ ఆమెను భర్త ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గంటన్నర తర్వాత పార్వతి చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పార్వతి మరణంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మర్డర్ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

విద్యార్థులకు యాపిల్ కంపెనీ బంపర్ ఆఫర్

విమాన ప్రమాదం.. యూఎస్ మీడియా కథనంపై ఏవియేషన్ ఎక్స్‌పర్ట్ ఆగ్రహం

Updated Date - Jul 20 , 2025 | 12:22 PM