Parliament Session: వినే ధైర్యం లేకుంటే ఆ పదవికి అర్హులు కారు.. మోదీపై ఖర్గే విమర్శలు
ABN , Publish Date - Jul 29 , 2025 | 04:25 PM
భద్రతా లోపాల కారణంగానే పహల్గాం ఉగ్రగాడి ఘటన జరిగిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఖర్గే ప్రశ్నించారు. హోం మంత్రి అమిత్‌షా ఇందుకు బాధ్యత వహించాలన్నారు. దేశంలో టెర్రర్ ఇన్‌ఫ్రా నడ్డివిరిగిందని కేంద్రం చెబుతున్నప్పుడు పహల్గాం ఉగ్రదాడి ఎలా జరిగిందని నిలదీశారు.

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై ఉభయసభల్లో చర్చ జరుగుతుండగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభలో లేకపోవడాన్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తప్పుపట్టారు. తామంతా అఖిల పక్ష సమావేశంలో పాల్గొంటే ఆయన బీహార్‌లో రాజకీయ ర్యాలీలో పాల్గొన్నారని అన్నారు. 'మీరు ఏదో సభలో ఇక్కడ ఉండాల్సింది. వినేందుకు మీకు ధైర్యం లేకపోతే మీరు ఆ పదవిలో ఉండటానికి అర్హులు కారు' అని ఖర్గే విమర్శించారు. ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఉగ్రదాడిపై రాజ్యసభలో మంగళవారంనాడు ప్రారంభమైన ప్రత్యేక చర్చిలో ఖర్గే మాట్లాడారు.
భద్రతా లోపాల కారణంగానే పహల్గాం ఉగ్రగాడి ఘటన జరిగిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఖర్గే ప్రశ్నించారు. హోం మంత్రి అమిత్‌షా ఇందుకు బాధ్యత వహించాలన్నారు. దేశంలో టెర్రర్ ఇన్‌ఫ్రా నడ్డివిరిగిందని కేంద్రం చెబుతున్నప్పుడు పహల్గాం ఉగ్రదాడి ఎలా జరిగిందని నిలదీశారు. పహల్గాం ఉగ్రదాడిని నిలువరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తన సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో జాతీయ భద్రత విషయంలో సాధించిన విజయాలను తక్కువ చేసి చూపిస్తూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఖర్గే విమర్శించారు. కాంగ్రెస్ ఆయుధాల ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే వాళ్లు అబద్ధాల ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. విపక్షాలు పాకిస్థాన్‌కు మద్దతిస్తున్నాయంటూ ఆసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి అసత్యాలతో ప్రజలను ఎక్కువకాలం మభ్యపెట్టలేరని, తామెప్పుడూ పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వలేదని, ఇచ్చే ప్రసక్తే కూడా లేదని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
కశ్మీర్‌లో అంతా ప్రశాంతతే ఉంటే పహల్గాం దాడి ఎలా జరిగింది: ప్రియాంక
ఆనందపడతారనుకుంటే.. సందేహపడుతున్నారు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం