Anil Chauhan: నిన్నటి ఆయుధాలతో నేడు యుద్ధంలో గెలువలేము
ABN , Publish Date - Jul 16 , 2025 | 04:26 PM
న్యూఢిల్లీలో బుధవారంనాడు జరిగిన యూఏవీ, కౌంటర్-అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ (సి-యూఏఎస్) స్వదేశీకరణ వర్క్‌షాప్‌లో అనిల్ చౌహాన్ మాట్లాడుతూ, ఇవాల్టి అధునాతన యుద్ధంలో అత్యాధునిక సాంకేతికతకు ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పారు.

న్యూఢిల్లీ: భారతదేశం తన రక్షణ సామర్థ్యాలను తక్షణం ఆధునీకరించాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ (Anil Chauhan) అన్నారు. రేపటి టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు యుద్ధం చేయాల్సి ఉంటుందని, నిన్నటి ఆయుధాలతో నేడు యుద్ధం చేసి గెలవలేమని వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీలో బుధవారంనాడు జరిగిన యూఏవీ, కౌంటర్-అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ (సి-యూఏఎస్) స్వదేశీకరణ వర్క్‌షాప్‌లో అనిల్ చౌహాన్ మాట్లాడుతూ, ఇవాల్టి అధునాతన యుద్ధంలో అత్యాధునిక సాంకేతికతకు ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పారు. నిన్నటి ఆయుధాలతో ఇవాళ యుద్ధంలో గెలవలేమన్నారు. మన వ్యూహాత్మక మిషన్లకు కీలకమైన సాంకేతికత కోసం విదేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలని సూచించారు. దిగుమతి చేసుకున్న టెక్నాలజీపై ఆధారపడితే మన సంసిద్ధత దెబ్బతింటుదన్నారు. ఇందువల్ల స్వదేశీ సాంకేతికతను త్వరితగతిన అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుదని చెప్పారు.
మేలో జరిగిన 'ఆపరేషన్ సిందూర్'ను ప్రస్తావిస్తూ, సరిహద్దుల వెంబడి నిరాయుధ డ్రోన్లు, మందుగుండు సామగ్రిని పాకిస్థాన్ మోహరించిందని, దాదాపు అన్నింటినీ సమర్ధవంతంగా నిర్వీర్యం చేశామని అనిల్ చౌహాన్ చెప్పారు. యూఏవీల వల్ల భారత సైన్యానికి కానీ, పౌరుల మౌలకి సదుపాయలకు కానీ ఎలాంటి నష్టం జరగలేదని వివరించారు.
ఇవి కూడా చదవండి..
చైనా పర్యటనకు మోదీ.. గల్వాన్ ఘర్షణల తర్వాత ఇదే మొదటిసారి
కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించండి.. మోదీకి ఖర్గే, రాహుల్ లేఖ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి