Share News

Bengalur: సారూ.. ఎక్కడుంటారు మీరు...

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:33 PM

మండలాల వ్యవస్థ ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా.. కొందరు అధికారులు మాత్రం స్థానికంగా ఉండకుండా పట్టణాల నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. దీంతో పరిపాలన వ్యవస్థ గాడితప్పుతోంది. అంతేగాక ప్రజలకు ప్రభుత్వ సేవలు అందకుండా పోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Bengalur: సారూ.. ఎక్కడుంటారు మీరు...

- గ్రామాల్లో కనిపించని వీఆర్వోలు

- కార్యాలయాల చుట్టూ జనం ప్రదక్షిణ

బెంగళూరు: గ్రామాల్లో కీలకమైన గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు) అందుబాటులో ఉండటం లేదు. దీంతో ప్రజలు తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఉన్నతాధికారులు కూడా పట్టించుకోలేదు. వీఆర్వోలు స్థానికంగా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ భూసమస్యలు పేరుకు పోతున్నాయి. బొమ్మనహాళ్‌(Bommangal) మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. కొందరు వీఆర్వోలు గ్రామాల్లో కాకుండా తహసీల్దార్‌ కార్యాలయంలోనే పనులు చేస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: High Court: మంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. ఏం జరిగిందంటే..


గ్రామాలకు చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నారు. ప్రజలకు కావాల్సిన ధ్రువపత్రాలు, భూ సమస్యల పరిష్కారం కోసం వ్యయ ప్రయాసలతో మండల కేంద్రానికి రావాల్సిన వస్తోంది. మండలంలో మొత్తం 16 పోస్టులకుగాను 10 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీఆర్వోలు కొరత ఉన్న గ్రామాలకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. వీరు ఏరోజు ఏ గ్రామంలో ఉంటారో తెలియక ధ్రువ పత్రాల కోసం మండల కేంద్రం, ఇతర గ్రామాల చుట్టూ తిరుగుతున్నారు. విద్యార్థులు, రైతులు, ప్రజలకు అవసరమైన పత్రాలు పొందేందుకు వీఆర్వోల సంతకాలు తప్పనిసరి కావడంతో ఆలస్యమవుతోంది.


గ్రామ స్థాయిలో భూ సమస్యలు, హద్దుల వివాదాలు, జాయింట్‌ ఎల్పీనెంబర్లు వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. సకాలంలో పరిష్కారం కాకపోవడంతో ఇవి జఠిలంగా మారుతున్నాయి. వైసీపీ పాలనలో జరిగిన భూ తప్పిదాలు కొత్త ప్రభుత్వంలోనైనా పరిష్కారమవుతాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న వీఆర్వోలు ఒకరో, ఇద్దరో మండల కేంద్రంలో నివాసం ఉంటే.. చాలామంది బళ్లారి, అనంతపురం ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఎప్పుడు వస్తారో, ఎప్పుడు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొందని ప్రజలు మండిపడుతున్నారు. కొందరు వీఆర్వోలు ఎంతో కొంత ఇస్తేగాని సంతకాలు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


భూ సమస్యలను పరిష్కరిస్తున్నాం

బొమ్మనహాళ్‌ మండలంలో ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. వీఆర్వోలు అందుబాటలో ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఎవరికైనా సమస్యలు పరిష్కారం కాకపోతే నేరుగా నా దగ్గరికి వస్తే వాటిని పరిష్కరిస్తా. కొన్ని రె వెన్యూలు గ్రామాలకు వీఆర్వోలు లేకపోవడం వల్ల కొందరికి అదనపు బాధ్యతలు ఇచ్చాం. అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం.

-మునివేలు, తహసీల్దారు, బొమ్మనహాళ్‌


ఈ వార్తలు కూడా చదవండి

దేశ భద్రతపై కాంగ్రెస్‌ చౌకబారు రాజకీయాలు

పంచాయతీలకు ఎన్నికల్లేవు.. అభివృద్ధికి నిధుల్లేవు!

కౌశిక్‌ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట

పర్యాటకుల మతం అడిగి పాశవికంగా కాల్చారు

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 25 , 2025 | 12:33 PM