Tragic Incident: కరూర్ మృతుల కుటుంబాలకు 20 లక్షలు
ABN , Publish Date - Oct 19 , 2025 | 04:18 AM
కరూర్ తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ రూ.20 లక్షల చొప్పున అందజేసింది.
విజయ్ పార్టీ తరఫున ఖాతాల్లో జమ
చెన్నై, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): కరూర్ తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ రూ.20 లక్షల చొప్పున అందజేసింది. కరూర్ వేలుచామిపురంలో గత నెల 27న టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతిచెందగా, 100 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్సలు పొంది డిశ్చార్జి అయ్యారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, రూ.20లక్షల చొప్పున సాయం అందిస్తామని టీవీకే అధ్యక్షుడు విజయ్ ఇంతకుముందే ప్రకటించారు.