Vice President: అస్వస్థతకు గురైన ఉపరాష్ట్రపతి
ABN , Publish Date - Mar 09 , 2025 | 10:54 AM
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.ఛాతీలో నొప్పి, అసౌకర్యం ఉండడంతో ఆయనను ఆదివారం తెల్లవారు జామున ఎయిమ్స్‌లో చేర్పించారు.

న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Vice President of India Jagdeep Dhankhar) ఆదివారం తెల్లవారు జామున స్వల్ప అస్వస్థతకు (Illness) గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీ (Delhi)లోని ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్పికి తరలించారు. ధన్‌ఖడ్ కార్డియాక్ (Cardiac) విభాగంలో చికిత్స (Treatment) అందిస్తున్నారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.ఈరోజు సాయంత్రం ఆయనకు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇంకా ఏమైన ఆరోగ్య సమస్యలు ఉంటే పరీక్షలు చేసే అవకాశముంది.
Read More News..:
బోరుగడ్డ ఎక్కడ ఉన్నంది గుర్తించిన పోలీసులు..
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఛాతీలో నొప్పి, అసౌకర్యం ఉండడంతో ఆయనను ఆదివారం తెల్లవారు జామున ఎయిమ్స్‌లో చేర్పించారు. 73 ఏళ్ల జగదీప్‌ను ఆదివారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలించారు.ఎయిమ్స్‌లోని కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉప రాష్ట్రపతి క్రిటికల్ కేర్ యూనిట్‌లో చేర్చారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండి, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరికాసేపట్లో ధన్‌ఖడ్ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్ వెలువడే అవకాశముంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం కీలక నిర్ణయం..
అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ
కీలకమలుపు తిరిగిన రన్యారావు కేసు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News