Share News

Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..

ABN , Publish Date - May 24 , 2025 | 02:53 PM

Government Doctor And Wife: నా పెళ్లి కారణంగా మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోయిన తర్వాత పరిస్థితి దారుణంగా తయారైంది. నాపై, మా పిన్నిపై దాడి చేసి ఫోన్ లాక్కెళ్లిపోయారు.

Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..
Government Doctor And Wife

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొన్నేళ్ళ పాటు ఎంతో అన్యోన్యంగా గడిపారు. వీరి ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డ కూడా పుట్టాడు. ఏమైందో ఏమో తెలీదు కానీ, ఇద్దరి మధ్యా గొడవలు మొదలయ్యాయి. గత కొంతకాలం నుంచి ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు దారుణమైన కామెంట్లు చేసుకుంటున్నారు. తన భర్త ఓ ట్రాన్స్ జెండర్ అని భార్య అంటోంది. నా భార్య పరాయి మగాళ్లతో తిరుగుతోందని భర్త అంటున్నాడు. మొత్తానికి వీరి గొడవ జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ సంగతేంటంటే...


ఉత్తర ప్రదేశ్, సంత్ కబిర్ నగర్‌కు చెందిన వరుణేష్ దూబే కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతడు కొన్నేళ్ళ క్రితం మిసెస్ పాండేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. గత కొంతకాలం నుంచి ఇద్దరి మధ్యా గొడవలు నడుస్తున్నాయి. మిసెస్ పాండే మాట్లాడుతూ.. ‘ నా భర్త నన్ను గోరఖ్‌పూర్‌లోని మా ఇంట్లో వదిలి వెళ్లాడు. ప్రభుత్వం ఇచ్చిన ఇంటిలో బూతు పురాణం సాగిస్తున్నాడు. నా భర్త ఓ ట్రాన్స్‌జెండర్. అతడు వేరే మగాళ్లను ఇంటికి పిలిపించుకునేవాడు. ఆడవాళ్లలా దస్తులు వేసుకునే వాడు.


మగాళ్లతో బూతు వీడియోలు చేసేవాడు. ఓ వెబ్ సైట్‌లో నా భర్త వీడియోలు చూశాను. ఆ వీడియోలు ఆ ఇంట్లోనే తీశారు. నేను అతడితో మాట్లాడటానికి వెళితే.. నన్ను, నా సోదరుడ్ని కొట్టాడు’ అని అంది. డాక్టర్ దూబే మాట్లాడుతూ.. ‘ నా భార్య మంచిది కాదు. నేను ఇంట్లో లేనప్పుడు చాలా మంది మగాళ్లు ఇంటికి వచ్చి వెళుతూ ఉన్నారు. ఆస్తి కోసం ఇదంతా చేస్తోంది.

నా పెళ్లి కారణంగా మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోయిన తర్వాత పరిస్థితి దారుణంగా తయారైంది. నాపై, మా పిన్నిపై దాడి చేసి ఫోన్ లాక్కెళ్లిపోయారు. డీప్ ఫేక్ వీడియోలు చేసి, నా పరువు తీయాలని అనుకుంటోంది’ అని అన్నాడు. డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మహేంద్ర ప్రసాద్ ఈ సంఘటనపై స్పందించారు. దర్యాప్తు జరుపుతామని హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి

Seethakka On KTR: కవిత చెప్పిన దెయ్యం ఆయనే.. సీతక్క కౌంటర్

NITI Aayog Meeting: స్వర్ణాంధ్రపై చంద్రబాబు ప్రజెంటేషన్.. నీతి ఆయోగ్‌లో ప్రశంసల వర్షం

Updated Date - May 24 , 2025 | 04:13 PM