Wife With 4 Lovers: నలుగురు ప్రియులతో కలిసి భార్య ఘాతుకం.. భర్త హత్యకు కుట్ర..
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:00 PM
Wife With 4 Lovers: భార్య రితాన్షి మగ స్నేహితులతో కలిసి తరచుగా మందు తాగేది. వారితో వెళ్లి.. కొన్ని రోజుల పాటు ఇంటికి వచ్చేదే కాదు. ఈ నేపథ్యంలోనే ఆమె తన నలుగురు ప్రియుళ్లతో భర్త హత్యకు ప్లాన్ చేసింది.

ఈ మధ్య కాలంలో మగాళ్లపై దారుణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. భర్తలను హత్య చేస్తున్న భార్యల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. మరీ ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో మగాళ్లపై ఆడవాళ్ల నేరాలు టాప్‌లో ఉంటున్నాయి. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్యలు చాలా మందే ఉన్నారు. తాజాగా, ఓ మహిళ తన నలుగురు ప్రియుళ్లతో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. భర్తను చంపి అతడి ఇన్సురెన్స్ డబ్బులు కాజేయాలని చూసింది. ఈ విషయం భర్తకు తెలిసిపోయింది. భార్య కుట్ర భగ్నం అయింది. భార్య సంబంధాల గురించి.. మర్డర్ ప్లాన్ గురించి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, మీరట్‌కు చెందిన గౌరవ్ శర్మ, రితాన్షి శర్మలకు 2012లో పెళ్లయింది. కట్నం తీసుకోకుండానే అతడామెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లన తర్వాత రితాన్షి భర్తతో కలిసి అత్తింట్లోనే ఉండేది. తరచుగా అందరితో గొడవ పెట్టుకునేది. చాలా నీచంగా ప్రవర్తించేది. దీంతో గౌరవ్, రితాన్షి వేరు కాపురం పెట్టారు. వేరే ఇంటికి మారిన తర్వాతనైనా ఆమె ప్రవర్తనలో మార్పు వస్తుందని భర్త భావించాడు. అయినా లాభం లేకపోయింది. మగ స్నేహితులతో కలిసి ఆమె తరచుగా మద్యం తాగేది. కొన్ని రోజుల పాటు ఇంటికి రాకుండా బయటే ఉండేది. పొరిగిళ్ల వారు రితాన్షి ప్రవర్తనపై గౌరవ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే గౌరవ్ 12 ఏళ్ల తన మేనల్లుడ్ని ఇంటికి పిలిపించాడు.
తమతో పాటే ఉంచుకున్నాడు. గౌరవ్ మేనల్లుడు రితాన్షి చెడు పనుల గురించి చెబుతూ ఉండేవాడు. రితాన్షి దాదాపు 5 మంది మగాళ్లతో సంబంధం పెట్టుకున్నట్లు గౌరవ్‌కు ఆధారాలు కూడా దొరికాయి. వాటిలో కొన్ని ఫొటోలు, వీడియోలు, స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి. రితాన్షీ తన పేరు మీద ఉన్న 40 లక్షల ట్రావెల్ ఇన్సురెన్స్ కోసం హత్యకు కుట్ర పన్నినట్లు గుర్తించాడు. నలుగురు ప్రియుళ్లతో కలిసి ఆమె ప్లాన్ చేసినట్లు తెలుసుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన దగ్గర ఉన్న ఆధారాలను వారికి సమర్పించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఫేక్ డాక్టర్‌తో ఇంట్లో ఆపరేషన్.. మహిళ ప్రాణం పాయే..
Brides Mother: పచ్చి మోసం.. పిల్ల అని చెప్పి తల్లితో పెళ్లి చేశారు..