తనకు ఆ రోగం ఉందని తెలిసి భార్యను చంపేశాడు..
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:44 PM
కులదీప్ దంపతులకు ఓ ఇద్దరు కొడుకులు ఉన్నారు. క్యాన్సర్ ఉన్నట్లు తేలటంతో అతడు బాగా కృంగిపోయాడు. ఈ నేపథ్యంలోనే దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో తన లైసెన్స్ గన్ తీసుకున్నాడు.

లక్నో: మనుషులకు డబ్బు పిచ్చి పట్టుకుంది. సొంత ప్రాణం, బంధాల కంటే డబ్బే ఎక్కువ అయిపోయింది. డబ్బు కోసం చావడానికైనా.. చంపడానికైనా కొంత మంది సిద్ధపడుతున్నారు. డబ్బు లేకుండా.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు కక్కుర్తి పడుతున్నారంటే.. దారుణాలకు పాల్పడుతున్నారంటే ఓ అర్థం ఉంది. లక్షలు, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవారు కూడా మరింత డబ్బుల కోసం.. ఉన్న డబ్బుల్ని మిగుల్చుకోవటం కోసం గడ్డి తింటున్నారు. తాజాగా, ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన భార్యను తుపాకితో కాల్చి చంపాడు. తాను కూడా కాల్చుకుని చనిపోయాడు. ఆ వ్యక్తి ఎందుకు ఇలా చేశాడో తెలిస్తే .. మీకు కోపం రాకమానదు..
ఆ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, ఘజియాబాద్‌కు చెందిన 46 ఏళ్ల కులదీప్ త్యాగి రియల్ ఎస్టేట్ డీలర్‌గా ఉన్నాడు. అంతకు ముందు అతడు పోలీస్ శాఖలో పని చేసి రిటైర్ అయ్యాడు. కులదీప్ దంపతులకు ఓ ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొన్ని నెలల క్రితం వరకు కులదీప్ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. ఇలాంటి సమయంలో క్యాన్సర్ చిచ్చు పెట్టింది. కులదీప్‌కు క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. క్యాన్సర్ ఉన్నట్లు తేలటంతో అతడు బాగా కృంగిపోయాడు. ఈ నేపథ్యంలోనే దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో తన లైసెన్స్ గన్ తీసుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లో భార్య తప్ప.. ఎవ్వరూ లేరు.
నేరుగా భార్య దగ్గరకు వెళ్లాడు. ఆమెను గన్నుతో కాల్చిపడేశాడు. అనంతరం తను కూడా కాల్చుకున్నాడు. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరు పిల్లలు ఇంటికి రాగానే తల్లిదండ్రులు రక్తపు మడుగులో కనిపించారు. వెంటనే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే వాళ్లు చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటికి వెళ్లారు. అక్కడ వాళ్లకు ఓ సూసైడ్ నోట్ దొరికింది. ‘ నాకు క్యాన్సర్ వచ్చిందని తెలిసింది. దానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా నయం అవుతుందన్న నమ్మకం లేదు. డబ్బులు వేస్ట్. అందుకే చనిపోవాలనుకున్నా. కలకాలం తనకు తోడుగా ఉంటానని నా భార్యకు మాటిచ్చా.. అందుకే తనను కూడా తీసుకెళుతున్నా’ అని రాశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
BCCI: అభిషేక్ నాయర్.. టీ దిలీప్‌లకు ఊహించని షాక్..
మనిషి కాదు మృగం.. 11 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా..