UGC NET Results: యూజీసీ నెట్ పరీక్ష ఫలితాల వెల్లడి
ABN , Publish Date - Jul 22 , 2025 | 05:05 AM
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్‌టీఏ జూన్ నెలలో నిర్వహించిన

న్యూఢిల్లీ, జూలై 21: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జూన్ నెలలో నిర్వహించిన యూజీసీ-నెట్ పరీక్షల ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్-జేఆర్‌ఎఫ్ కోసం 5,269 మంది ఎంపికయ్యారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం 54,885 మంది అర్హత సాధించారు. కేవలం పీహెచ్‌డీ ప్రవేశాల కోసం 1,28,179 మంది అర్హత పొందారు. పరీక్ష కోసం మొత్తం 10,19,751 మంది పేర్లు నమోదు చేసుకోగా అందులో 7,52,007 మంది రాశారు. 4,28,853 మంది పురుషులు పేర్లు నమోదు చేసుకోగా, వారిలో 3,05,122 మంది పరీక్షకు హాజరయ్యారు. 5,90,837 మంది మహిళలు పేర్లు నమోదు చేసుకోగా, 4,46,849 మంది పరీక్ష రాశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News