Share News

Dubai Marriage Leave: దుబాయ్‌లో 10 రోజుల ‘వివాహ సెలవు’

ABN , Publish Date - Jul 18 , 2025 | 06:09 AM

దుబాయ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పది రోజుల పాటు ‘వివాహ సెలవు’ను మంజూరు చేస్తున్నట్టు దేశ పాలకుడు

Dubai Marriage Leave: దుబాయ్‌లో 10 రోజుల ‘వివాహ సెలవు’

  • మంజూరు చేసిన పాలకుడు

దుబాయ్‌, జూలై 17: దుబాయ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పది రోజుల పాటు ‘వివాహ సెలవు’ను మంజూరు చేస్తున్నట్టు దేశ పాలకుడు, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రధాని, ఉపాధ్యక్షుడు అయిన షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ ప్రకటించారు. ఈ పది రోజుల పాటు పూర్తి వేతనం చెల్లిస్తారని తెలిపారు. ఈ సెలవులను కేవలం వివాహ సమయంలో మాత్రమే కాకుండా ఏడాదిలో ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేక పరిస్థితిల్లో మరుసటి సంవత్సరం కూడా వినియోగించుకునే వీలుంది. ప్రొబేషనరీ కాలాన్ని పూర్తి చేసుకున్న ఉద్యోగులు యూఏఈ పరిధిలోని వ్యక్తులను తగిన అనుమతులతో వివాహం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి.

Updated Date - Jul 18 , 2025 | 06:09 AM